Moviesతండ్రి పుట్టిన రోజు కానుకగా గుడ్ న్యూస్ చెప్పనున్న మెగా డాటర్‌...

తండ్రి పుట్టిన రోజు కానుకగా గుడ్ న్యూస్ చెప్పనున్న మెగా డాటర్‌ నిహారిక..!!

మెగా డాటర్‌ నిహారిక.. పెరుకు తగ్గటే చక్కగా నవ్వుతూ..అందరిని నవ్విస్తూ ఉంటుంది. కొణిదెల ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొన్ని సినిమాలు..వెబ్ సిరీస్ లు చేసినా..వాటిలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు కదా..కనీసం పాజిటివ్ టాక్ ను కూడా సొంతం చేసుకోలేక పోయాయి. దీంతో నిహారిక సినీ కెరీర్ నిగ్ ఫెయిల్యూర్ రిజల్ట్ అందుకుంది.

మెగా డాటర్ గా సినిమాలు చూసిని అభిమానులు నిహారిక ఇక సినిమాల్లో నటించడం మానేస్తే బెటర్ అని కూడా అన్నారు. అయితే సూర్యాకంతం సినిమా ఫెయిల్యూర్ తరువాత..ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ..చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుని హ్యాపీగా వెడ్డింగ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. భర్తతో కలిసి తిరిగిన ఫోటోలు..అత్తగారింట్లో సరదాగా గడిపిన మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది ఈ మెగా ముద్దుగుమ్మ.

అయితే సోషల్ మీడియాలో బాగా Yఆక్టివ్ గా ఉండే ఈ మెగా డాటర్..తన తండ్రి పుట్టిన రోజు సంధర్భంగా..ఆమెకు సంబంధించిన బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. తాజాగా జీ5 నిర్మిస్తోన్న ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాని జీ5 సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు జీ5 ట్వీట్‌ చేస్తూ.. మరో అద్భుతమైన అనుభూతి కోసం రెడీగా ఉండండి అని తెలిపింది. ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఏంటో గెస్ చేయగలరా? అని అడిగింది. మరి నిహారిక కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి క్లారిటీ రావాలంటే మరికొద్ది సేపు ఆగాల్సిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news