భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ ఎంఎస్. ధోనీ క్రికెట్ నుంచి రిటైడ్ అయ్యిన విషయం తెలిసిందే. చరిత్రకు ఆయన ఓ సాక్ష్యం… ధోనీ భారత క్రికెట్ కు ఒక సరికొత్త పాఠం… అంతకు ముందు ఎవరికీ సాధ్యం కాని ప్రయాణం సాగించాడు. వన్డే క్రికెట్ లో దూకుడు అస్త్రంతో భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. 1983 తర్వాత కలగా ఉన్న వరల్డ్ కప్ డ్రీమ్ ను సాధించిపెట్టాడు.
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని.. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇక ధోని వయసు పెరగడంతో ఐపీఎల్లో ఎన్ని రోజులు కొనసాగుతాడనేది అనుమానంగా మారింది. భారత క్రికెట్ టీంకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో అలరిస్తున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా గా అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలోనే ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పానున్నట్లు తెలుస్తుంది. మహీ భార్య సాక్షి ప్రస్తుతం నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ గెలుపును ఆస్వాదిస్తున్న మహీ అభిమానులకు సీఎస్కే బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా భార్య ప్రియాంక మరో గుడ్ న్యూస్ చెప్పినట్లు సమాచారం. . ధోని మళ్లీ తండ్రి కాబోతున్నాడని ఆమె తెలిపారని వార్తలు వస్తున్నాయి. మహీ భార్య సాక్షి ప్రస్తుతం నాలుగు నెలల గర్భంతో ఉందని ప్రియాంక వెల్లడించారని తెలుస్తోంది.దీంతో నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా ధోనీకి కంగ్రాట్స్ చెబుతున్నారు
ధోనీ రాంచీలో కేవలం ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్నాడు.ఆ తర్వాత క్రికెట్ మాయలో పడి చదువుకు దూరం అయ్యాడు. ఆ తర్వాత క్రికెట్లో రాణించడంతో ఎలాగైనా డిగ్రీ చదవాలన్న కోరికతో 2008లో రాంచీలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో వొకేషనల్ స్టడీస్ అయిన ఆఫీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ కోర్సులో బ్యాచిలర్ డిగ్రీలో చేరాడు.
అయితే క్రికెట్‌పై కాన్‌సంట్రేషన్ చేయడంతో ఆరు సెమిస్టర్లలో ఒక్క దాంట్లో కూడా ఉత్తీర్ణుడు కాలేదు. ఇక ధోనీ స్టడీస్‌లో అంత గొప్పేం కాదు… టెన్త్‌లో 66 శాతం, ఇంటర్‌లో 56 శాతం మార్కులు మాత్రమే సాధించానని గతంలో ఓ సారి తెలిపారు. 2011 నవంబరులో ధోనీకి ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది.