Moviesఇంట్రెస్టింగ్ అప్డేట్ : ఆమె పని ఫినిష్ .. ఇక మిగిలింది...

ఇంట్రెస్టింగ్ అప్డేట్ : ఆమె పని ఫినిష్ .. ఇక మిగిలింది ఆయననే..!!

స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆది పురుష్’ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ రామాయణం నేపథ్యంలో ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న సినిమా. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు క్రేజీ స్టార్ల‌తో ఈ సినిమాకు నేష‌న‌ల్ క్రేజ్ వ‌చ్చేసింది.

అక్టోబర్ 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నేపథ్యంలో ఆదిపురుష్ చిత్రాన్ని వీలైనంత తొందరగా పూర్తిచేయాలని కసరత్తులు చేస్తున్నాడు ఓంరౌత్. ఇటీవలే ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ తన రోల్ షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ చిత్రయూనిట్ ఘనంగా రావణుడికి వీడ్కోలు పలికింది. అయితే ఈ సినిమా మొదలైన దగ్గరనుంచి ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఆదిపురుష్ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న కృతి సనన్ సైతం షూటింగ్ కంప్లీట్ చేసింది. ఈ సందర్భంగా ఆదిపురుష్ చిత్రయూనిట్ కృతి సనన్‏కు ఘనంగా వీడ్కోలు పలికారు.
జాన‌కి పాత్ర పోషిస్తున్న కృతి స‌న‌న్ పార్ట్ పూర్తైంద‌ని చెబుతూ.. డైరెక్టర్ ఓంరౌత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news