Moviesఅందరిని ఆకట్టుకుంటున్న "మళ్లీ మొదలైంది" ట్రైలర్..హైలెట్ సీన్ అదే.. ఖచ్చితంగా చూడాల్సిందే..!!

అందరిని ఆకట్టుకుంటున్న “మళ్లీ మొదలైంది” ట్రైలర్..హైలెట్ సీన్ అదే.. ఖచ్చితంగా చూడాల్సిందే..!!

అక్కినేని హీరో సుమంత్ హిట్లు ఫ్లాప్‌‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం త్యెలిసిందే. మొన్నామధ్య మళ్ళీరావా సినిమాతో మంచి హిట్ అందుకున్న సుమంత్.. ఇప్పుడు మళ్ళీ మొదలైంది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. సుమంత్, నైనా గంగూలీ, యాంకర్ వర్షిణి సౌందర రాజన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మళ్ళీ మొదలైంది’.. కార్తీక్ కుమార్ దర్శకుడు. పోసాని, ఘట్టమనేని మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీటర్‌ వేదికగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. భార్యతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి ప్రయత్నాలు చేసే క్యారెక్టర్‌లో కనిపించాడు సుమంత్.

ఈ ట్రైలర్‌లో ముందుగా టామ్ క్రూయిజ్-నికోల్ కిడ్.. మ్యాన్ బిల్ గేట్స్-మిలిందా గేట్స్.. బ్రాడ్ ఫైట్-ఏంజిలినా జోలీ జంటలను చూపిస్తూ కొన్ని పెళ్లిళ్లు విడాకులతో ఎండ్ అవుతాయి అని చూపించారు.. విడాకుల తర్వాత ఒక మగాడి జీవితంలో జరిగిన పరిణామాలు, సానుభూతులు, తిరిగి మరో అమ్మాయిని ప్రేమించడం ఇవన్నీ ట్రైలర్‌లో చూపించారు. తన విడాకుల కేసు వాదించిన లాయర్‌నే లవ్ చెయ్యడం హైలెట్ అసలు. విజువల్స్, ఆర్ఆర్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘మళ్ళీ మొదలైంది’ సుమంత్ కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుందనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news