Moviesపాప బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దదే..బాగా రిచ్ ఫ్యామిలీ..!!

పాప బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దదే..బాగా రిచ్ ఫ్యామిలీ..!!

శ్రీలీల.. ‘పెళ్లి సందడ్’ అనే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన క్యూట్ ముద్దుగుమ్మ. ఒక్కటి అంటే ఒక్క సినిమాతో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది ఈ సొట్ట బుగ్గల సుందరి. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఈమె పేరుకూడా తెలియదు. కానీ, ఈ సినిమా తరువాత..ఈమె దర్శక నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది. శ్రీకంత్ కొడుకు హీరోగా తెర‌కెక్కిన ‘పెళ్లి సందడ్’ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ శ్రీలీల. . ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చి మంచి టాక్ తెచ్చుకుంది.

త‌న మొద‌టి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటి 2001జూలై 14వ తేదీన అమెరికాలోని డెట్రాయిట్ లో జన్మించింది. ఈమె తండ్రి శుభకరరావు ..అతిపెద్ద బిజినెస్ మ్యాన్. ఈమె తల్లి స్వర్ణలత డాక్టర్ . చేసిన మొదటి సినిమాతోనే ఆడియన్స్‌‌ని మేస్మైరైజ్ చేసింది ఈ భామ .. ఫ్యామిలీ అంతా బెంగుళూరుకి షిఫ్ట్ అవ్వడంతో అక్కడే స్టడీస్ పూర్తి చేసింది. ఇక శ్రీ లీల తల్లి బాటలో డాక్టర్ అవ్వాలని డాక్టర్ చదవడం మొదలు పెట్టింది.

కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్నది శ్రిలీల.. చదువుకుటున్న సమయంలోనే భరత నాట్యం నేర్చుకుంటూ, ఫ్రెండ్స్ తో కలసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఇక 2019 సంవత్సరంలో కన్నడ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కిస్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి పైన పడింది. ఇక బెంగుళూరులో ఖరీదైన ఇంట్లో ఉంటోన్న..అమ్మడు ఆస్తి విషయాలకు వస్తే.. ఈమె నెట్ వర్త్ రూ.20కోట్లు ఉంటుందట.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ శ్రీలీల మెగా కాంపౌండ్ లోకి అడుగుపెడుతుందని టాక్ వినిపిస్తుంది. త్వరలో శ్రీలీల ఓ మెగా హీరో సరసన నటించనుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాలు కాని హిట్ అయితే ఈ అమ్మడికి స్టార్ డమ్ రావడం పక్కా అనే చెప్పాలి. మరి చూడాలి ఏం జరుగుతుందో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news