Moviesర‌వితేజ ఖాతాలో మరో హిట్ పక్కా.. ధమాకా ఫ‌స్ట్ లుక్ అదుర్స్..!!

ర‌వితేజ ఖాతాలో మరో హిట్ పక్కా.. ధమాకా ఫ‌స్ట్ లుక్ అదుర్స్..!!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ గ‌త కొంత కాలంగా త‌న స్థాయికి త‌గిన హిట్ లేక రేసులో పూర్తిగా వెన‌క‌ప‌డిపోయారు. ఒక‌ప్పుడు ర‌వితేజ సినిమా వ‌స్తుందంటే భారీ అంచ‌నాలు ఉండేవి. బ‌య్య‌ర్లు పోటీ ప‌డి మ‌రీ రైట్స్ కొనేవారు. ఇప్పుడు ర‌వితేజ సినిమా వ‌స్తుందంటేనే ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ర‌వితేజ మార్కెట్ పూర్తిగా ప‌డిపోయింది. ర‌వితేజ మాస్ ప్రేక్ష‌కుల్లో మంచి ఇమేజ్ తెచ్చుకోవడంతో అత‌డికి మాస్ మ‌హ‌రాజ్ ముద్ర ప‌డిపోయింది. ఇక డిస్కోరాజా త‌ర్వాత ర‌వితేజ వ‌రుస పెట్టి సినిమాలు ఓకే చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గా గోపిచంద్ మల్లినేని డైరెక్షన్ లో వచ్చిన క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కోట్టాడు. ఈ సినిమాలో ఆయన పక్కన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘క్రాక్’ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టిన ర‌వితేజ ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ అనే సినిమా స్టార్ట్ చేశాడు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక రీసెంట్ గా ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన ద‌ర్శ‌కత్వంలో ర‌వితేజ హీరోగా సినిమా రాబోతుంద‌ని కొన్ని రోజులుగా వార్త‌లు ఈ రోజు అఫీషియ‌ల్‌గా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో ప‌ల‌క‌రించారు. ధ‌మాకా అనే టైటిల్‌తో మూవీ రూపొందుతుండ‌గా, ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో 20 ఏళ్ల కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందట. ఈ సినిమా గురించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news