Moviesఆ స్టార్ హీరోయిన్ భర్త సక్సెస్ కోసం చిరంజీవి ఏం చేసాడో...

ఆ స్టార్ హీరోయిన్ భర్త సక్సెస్ కోసం చిరంజీవి ఏం చేసాడో తెలుసా..?

చిరంజీవి.. రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలు ఓకే చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన ఈయన..వేదాళం..లూసీఫర్ రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఆయన చేతికి మైనర్ సర్ఝరీ చేయడంతో కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ వేసరు. అయితే తాజాగా ఆయన స్టార్ హీరోయిన్ భార్త కోసం గొంతు సవరించుకున్నారు.

యస్..స్టార్ సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ భర్త కృష్ణ వంశీ కోసం..’రంగ మార్తాండ’ కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన నుంచి మరో సినిమా కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గత పదేళ్లలో కృష్ణవంశీ నుంచి సూపర్ హిట్ అనే రేంజ్‌ సినిమా ఒక్కటి కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ కోసమే అన్నట్టుగా ఓ సాలిడ్ ఎమోషనల్‌ ఎంటర్టైనర్‌ను రెడీ చేస్తున్నారు కృష్ణవంశీ. మరాఠ సూపర్ హిట్ నటసామ్రాట్‌ను తెలుగు ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు బజ్ పెంచాల్సిన ఈ టైంలో ఆ బాధ్యతను చిరు తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ మేరకు కృష్ణవంశీ ట్విట్‌ చేస్తూ.. ‘అడగ్గానే ఒప్పుకుని.. మరేమీ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మా చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పినందుకు థాంక్యూ అన్నయ్యా’ అంటూ చిరుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘రంగమార్తాండ’ చిత్రంలో ప్రకాశ్ రాజ్తో పాటు రమ్యకృష్ణ కీ రోల్‌ పోషిస్తుండగా.. అనసూయ భరద్వాజ్‌, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరి చిరు సాయం సినిమాకు ఎంతమేర కలిసొస్తుందో చూడాలి.

 

 

Latest news