Moviesఆ బిగ్ బాస్ కంటెస్టేంట్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలయ్య..?

ఆ బిగ్ బాస్ కంటెస్టేంట్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలయ్య..?

నందమూరి నట సిమ్హం బాలయ్య తొలిసారి ఆహాలో అన్‌స్టాప‌బుల్ అనే టాక్‌షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుద‌లైంది. నంద‌మూరి బాలకృష్ణ …అన్‌స్టాప‌బుల్ అంటూ స‌రికొత్త అవ‌తారం ఎత్తిన సంగ‌తి తెలిసిందే. తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో బాల‌య్య హోస్ట్ చేయ‌బోతున్న టాక్ షో. ఈ టాక్ షో దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4 నుంచి ప్ర‌సారం కాబోతున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఓ వార్త కూడా బయటకు వచ్చింది.

ఈ షో లో బాలయ్య ఫస్ట్ గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబును ఇంటర్వ్యు చేయనున్నాడట. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మఓహన్ బాబు-బాలయ్య మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షో ప్రారంభం ముందు బాల‌య్య ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి అక్క‌డున్న డాన్స‌ర్స్‌తో క‌లిసి స్టెప్పులేస్తారు. ఇందుకు సంబంధించి కొరియోగ్రాఫర్ గా ఇటీవల బయటకి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఇచ్చారని సమాచారం.

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఐదో వారం ఎలిమినేట్‌ అయిన నటరాజ్‌ మాస్టర్‌ ఏకంగా నందమూరి బాలకృష్ణ నుంచి బంపర్‌ ఆఫర్‌ పట్టేశాడు. దీనికి సంబంధించిన కొరియోగ్ర‌ఫీని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ట‌. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో కూడా వైరల్‌ అవుతోంది. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!

 

 

View this post on Instagram

 

A post shared by Natrajmaster (@natraj_master)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news