Moviesఏడు వారాలకు రెమ్యున‌రేష‌న్ గా బిగ్ బాస్ యాజ‌మాన్యం ప్రియకి ఎంత...

ఏడు వారాలకు రెమ్యున‌రేష‌న్ గా బిగ్ బాస్ యాజ‌మాన్యం ప్రియకి ఎంత ఇచ్చిందో తెలుసా..?

శైలజా ప్రియ.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన మామిళ్ల శైల‌జా ప్రియ బుల్లితెర మీద న‌టిగా ఎన్నో అద్భుత‌మైన క్యారెక్ట‌ర్లు వేసి మెప్పించింది. శైల‌జ‌కు తిరుగులేని అంద చందాల‌తో పాటు అద్భుత‌మైన అభిన‌యం కూడా ఉంది. దీంతో ఆమెకు సినిమాల్లో కూడా మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన ప్రియసఖి సీరియల్ తో సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ప్రియ. ఈ సీరియల్ అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత మరికొన్ని సీరియల్స్ చేశారు.

కాగా ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు, త‌మిళ భాష‌ల్లో 80 సినిమాల్లో న‌టించిన ప్రియ. ఇప్పటికి తన అంద చందాల‌తో అంద‌రిని ఎట్రాక్ట్ చేస్తూ హీరోయిన్ లకు గట్టిపోటి ఇస్తుంది. ఇంతకు ఈ శైలజా ఆంటీ వ‌య‌స్సు ఎంతో తెలుసా..?? 43 సంవ‌త్స‌రాలు..! ఇక శైల‌జ‌కు సోష‌ల్ మీడియాలో మామూలు క్రేజ్ లేదు. ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డంతో పాటు తెలుగింటి ఆడపడుచులా , తనదైన శైలిలో ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇక ఈ క్రేజ్ తోనే ఆమె బిగ్ బాస్ లో ఆఫర్ కొట్టేసి.. అక్కడ హౌస్ లోను తన పర్ఫామేన్స్ ఈరగదీసింది. తోటి కంటెస్టేంట్ సన్నీ తో ఈమె ఫైటింగ్..మరో కంటెస్టేంట్ లహరి పై ఈమె వేసిన నింద .. ఎంత హాట్ గా నడిచాయో మనం చూసాం. అయితే ముందు నుంచి ప్రియ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు మిగిలిన హౌస్ మేట్స్. స‌న్నీతో ప‌దే ప‌దే గొడ‌వ ప‌డ‌డం ప్రేక్ష‌కుల‌కి కూడా ఏ మాత్రం న‌చ్చ‌లేదు.బంగారు కోడిపెట్ట‌టాస్క్‌లో స‌న్నీపై మాట‌ల దాడి చేయ‌డంతో ఆమెను ఎలిమినేట్ చేశారు.

ఇక రీసెంట్ గా జరిగిన ఎలిమినేషన్ లోం ఈమె బిగ్ బాస్ హౌ నుండి ఎలిమినేట్ అయ్యి తన ఇంటికి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్రియ‌కు ఎంత రెమ్యున‌రేష‌న్ ముట్టి ఉంటుందో అని ప్ర‌తి ఒక్క‌రు ఆరాలు తీస్తుండ‌గా.. ప్రియకు ఒక్క వారానికి రూ. 1.5 లక్ష రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు టాక్‌. అంటే ఈ లెక్కన ఏడు వారాలు హౌజ్‌లో ఉన్న ఈ సీనియర్‌ యాక్టర్‌ రూ. 10 లక్షలకుపైగానే రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news