Moviesనో డౌట్..ఆ విషయంలో నా నిర్ణయం మారదు .. షాకింగ్ ట్వీస్ట్...

నో డౌట్..ఆ విషయంలో నా నిర్ణయం మారదు .. షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన మిల్కీ బ్యూటి..!!

మిల్కీ బ్యూటిగా సినీ ఇండస్ట్రీలోఅడుగుపెట్టిన హీరోయిన్ తమన్నా. అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి ..టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇక ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంది తమన్నా. నిజానికి ఓక హీరోయిన్ పదిహేనేళ్ళు సినీ ఇండస్ట్రీలో కొనసాగడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అప్పుడెప్పుడో మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన తమన్నా.. ఆ తరవాత 100 % లవ్, రచ్చ, ఉసరవెల్లి మొదలగు చిత్రాలలో నటించి తన పేరును టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో చేర్చుకుంది. హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాలలో ప్రత్యేక గీతాలలో నటించిన ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో లో వైరల్ గా మారింది.

హీరోయిన్ తమన్నా భాటియా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆమె తల్లిదండ్రులు వరుడి కోసం వెతుకులాట ప్రారంభించారా? అంటే మిల్కీ బ్యూటీ చేసిన తాజా వ్యాఖ్యలు అవుననే సమాధానమిస్తున్నాయి. తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ సుందరాంగి కోసం సరైన వరున్ని వెతికే పనిలో ఆమె తల్లి రజనీ భాటియా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి తమన్నా అమెరికాకు చెందిన ఓ డాక్టర్‌తో డేటింగ్ చేస్తోందని, ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతోందని ఊహాగానాలు వినిపించాయి. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ ఊహాగానాలకు తెరదించుతూ.. తాను ఎవ్వరితో డేటింగ్ చేయడం లేదని, తన తల్లిదండ్రులు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది.

అయితే వరుసగా స్టార్ సీనియర్ హీరోయిన్ లు పెళ్లి పీఠలు ఎక్కేసారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది పెళ్లి చేసుకొని మ‌రి కొద్ది రోజుల‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంద‌ని అంటున్నారు. మరో సీనియ‌ర్ హీరోయిన్ న‌య‌న‌తార త్వ‌ర‌లోనే విఘ్నేష్ శివ‌న్‌తో పెళ్లి పీట‌లు ఎక్క‌నుంది. ఇక సమంత అయితే పెళ్లి చేసుకోవడం..విడాకులు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయింది. ఇక ర‌కుల్ కూడా ఇటీవ‌లే త‌న ప్రియుడిని ప‌రిచ‌యం చేసింది. ఈమె పెళ్లి కూడా మ‌రి కొద్ది రోజుల‌లోనే జ‌ర‌గ‌నుంది. ఇలాంటి క్రమంలో తమన్న తన పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని..ఖచ్చితంగా మా అమ్మ నాన్న లు చెప్పిన వాడినే చేసుకుంటా అంటూ అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news