MoviesOfficial Announcement:మరో తమిళ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ ఫిక్స్..హీరోయిన్...

Official Announcement:మరో తమిళ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ ఫిక్స్..హీరోయిన్ ఎవరో తెలుసా..??

సినిమా హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటుంది. అలాగే చరణ్ ఆచార్య సినిమాలో తన తండ్రిల్తో కలసి నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పక్కన హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబోమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. రీసెంట్ గా ఆమె పుట్టిన రోజు సంధర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు చిత్ర బృందం.

ఇక అంతేకాదు ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నాడు ఈ మెగా పవర్ స్టార్ చరణ్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్. ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరా క్రీయేహన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే చరం మరో సినిమాని లైన్ లో పెట్టేసాడు.

రామ్ చరణ్ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.. తమిళ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. యూవీ క్రియేష‌న్స్ కూడా త‌మ ట్విట్టర్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేసింది.గౌత‌మ్ తిన్న‌నూరి.. మ‌ళ్ళీరావా వంటి సినిమాతో పెద్ద హిట్ త‌ర్వాత నానితో క‌లిసి జెర్సీ చేశాడు. ఎమోష‌న‌ల్ కాన్సెప్ట్ మూవీల‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట‌గా పేరున్న గౌత‌మ్ తిన్న‌నూరి ఇప్పుడు చ‌ర‌ణ్‌ను ఎలా ప్రెజంట్ చేస్తాడ‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమాలో చరణ్ పక్కన సమంత హీరోయిన్ గా నటిస్తుందని ఇండస్ట్రీ వర్గాల అంటున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news