Moviesజగన్ కు థ్యాంక్స్ చెప్పిన అఖిల్ ..నాకు గాడ్ ఫాద‌ర్‌ ఆయ‌నే.....

జగన్ కు థ్యాంక్స్ చెప్పిన అఖిల్ ..నాకు గాడ్ ఫాద‌ర్‌ ఆయ‌నే.. ఎందుకంటే..?

చూస్తుంటే అక్కినేని అఖిల్ కళ నెరవేరిన్నట్లుంది. ఎప్పుడో సినీ ఇండట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ కి ఒక్కటి అంటే ఒక్కటి కూడా హిట్ పడలేదు. ఇక అఖిల్ కి సినిమాలు వద్దు..కలిసి రావు అనుకుంటున్న తరుణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా..పూజా హెగ్డే హీరోయిన్ గా అద్దిరిపోయే కధను వినిపించాడు డైరెక్టర్. అనుకున్నదే ఆలస్యం కాకుండా..సినిమాను సెట్స్ పై ఎక్కించేసారు అల్లు అరవింద్.

ఇక కరోనా కారణంగా ఎపూడో రిలీజ్ కావాల్సిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా..నేడు దసరా కానుకగా రిలీజ్ అయ్యి ..మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు అఖిల్ కు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ క్రమంలో అక్కినేని అఖిల్ రెస్పాండ్ అయ్యాడు. సినిమా ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. పెళ్లికి ముందు ఎలా ఉండాలి? పెళ్లి తరువాత ఎలా నడుచుకోవాలి? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది అని ..అందరు తప్పకుండా ఈ సినిమా చూడండి అని చెప్పారు.

ఇక అంతేకాదు త‌న ఫోన్‌లో అల్లు అర‌వింద్ పేరుని గాడ్ ఫాద‌ర్‌గా పెట్టుకున్న‌ట్టు తెలియ‌జేశాడు.ఎందుకంటే.. ఆయనతో సినిమాచేయడం వలన చాలా ఎక్స్పీరియన్స్ తో పాటు చాలా మంచి విషయాలు నేర్చుకున్నా అని చెప్పుతూ… విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకోవడానికి వెళ్లిన్నప్పుడు.. సరిగ్గా గుడి బయట ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది మన సినిమాకు ఏపి లో 100% ఆక్యుపెన్సీ లభించిందని..అప్పుడే అనుకున్న మాకు అమ్మవారే బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అనిపించింది. ఈ విషయంలో ఏపీ గవర్నమెంట్ కి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి థాంక్యూ వెరీమచ్ అంటూ చెప్పుకొచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news