MoviesOfficial: విడాకుల త‌ర్వాత స‌మంత సైన్ చేసిన ఫస్ట్ సినిమా ఇదే..!!

Official: విడాకుల త‌ర్వాత స‌మంత సైన్ చేసిన ఫస్ట్ సినిమా ఇదే..!!

సమంత.. నాగచైతన్య ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత హాట్ టాపిక్ అయ్యిందో..అంతేగా వాళ్లు విడాకులు తీసుకుంటున్నప్పుడు కూడా మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించారే కానీ ఎందుకు విడిపోతున్నాం అనే సంగతి చెప్పనే లేదు. దీంతో అటు అభిమానులు..ఇటు మీడియా వాళ్లకు నచ్చిన విధంగా ఊహీంచుకుంటున్నారు.

కొందరు సినిమాల కోసం సమంత ఇలాంటి పని చేసిందని..మరికొందరు బిడ్డలకోసం వాళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఊహించుకుంటున్నారు. అయితే విడాకులు తీసుకోబోతున్న అక్కినేని నాగార్జున కొడుకు..సమంత మాత్రం హ్యాపీగా వాళ్ల సినీ కెరీర్ పై దృష్టి పెట్టారు. నాగా చైతన్య రీసెంట్ గా లవ్ స్టోరూ తో అందుకున్న బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వరుస సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్ ని స్పీడ్ అప్ చేస్తున్నారు.

ఇక సమంత కూడా ఈ విడాకులు మ్యాటర్..తలనొప్పులు గురించి పక్కన పెట్టేసి..కెరీర్ లో ఎలా ముందుకు సాగాలి..ఎలాంటి సినిమాలు తీస్తే ప్రజలకు రీచ్ అవుదాం అని ఆలోచిస్తుందట. ఈ క్రమంలోనే సమంత విడాకుల తరువాత తన ఫస్ట్ సినిమాకు సైన్ చేసిన్నట్లు తెలుస్తుంది. సామ్‌ తన తదుపరి చిత్రం డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ప్రొడక్షన్‌ నెం.30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఓ విభిన్నమైన ప్రేమకథ చిత్రంగా ఈ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభులు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ మూవీ తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల‌లో వెల్ల‌డించ‌నున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news