టాలీవుడ్లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా స్టార్ బ్యూటీల లెక్కే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా కొంతకాలం స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేసిన బ్యూటీలు ఫాం కోల్పోయినవెంటనే ఫేడ్ అవుట్ అయిపోతారు. కానీ తెలుగులో దశాబ్ధ కాలంగా స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న బ్యూటీలు కొందరు ఉన్నారు. వీరిలో అందాల చందమామ కాజల్ కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 13 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్ గానే రాణిస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.
అప్పటి నుంచి కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు కాజల్. గతేడాది అక్టోబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. ఈ జంట సూపర్ హిట్ గా ఉందంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహమాడిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. గత కొద్ది రోజులుగా కాజల్ అగర్వాల్ గర్భవతి అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది గౌతమ్ కిచ్లు తో వివాహం చేసుకున్న కాజల్ ఇప్పుడు తన మొదటి బిడ్డకు జన్మనివ్వనుందని తెలుస్తోంది.
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఎమోజీలే అందుకు ఉదాహరణ అని అభిమానులు భావిస్తున్నారు. ఇక కాజల్ తల్లి కాబోతున్న సందర్భంగా విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకుని..ప్రస్తుతం చిరంజీవి-కొరటాల శివ ‘ఆచార్య’చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ త్వరగా పూర్తి చేయాల్సిందిగా మేకర్స్‌ను కోరిందట. ఇక అలాగే ఆమె సైన్ చేసిన రెండు బడా ప్రాజెక్ట్స్ నుండి కూడా తప్పుకునిందట కాజల్. మరి చూడాలి కాజల్ ఈ విషయాల పై రియాక్ట్ అవుతుందో లేదో..?