Moviesఅటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ కి ఆమెనే ఫైనల్ చేసిన...

అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ కి ఆమెనే ఫైనల్ చేసిన బాలయ్య..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోయిన్స్‌ అంతా కూడా కుర్ర హీరోలతో రొమాన్స్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున వంటి సీనియర్‌ స్టార్‌ హీరోలతో నటించేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. స్టార్‌ హీరోలతో ఒకటి రెండు సినిమాలు చేయడం వల్ల కుర్ర హీరోలతో సినిమాలు చేసే అవకాశం రాదేమో అనే ఉద్దేశ్యంతో కొందరు హీరోయిన్స్‌ సీనియర్‌ స్టార్‌ హీరోల ఆఫర్లను వదులుకుంటున్నారు. కొందరు మాత్రమే కాస్త తెలివిగా ఆలోచించి సీనియర్‌ స్టార్‌ హీరోలతో నటిస్తున్నారు.

సీనియర్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ నయనతార. ఈ అమ్మడు తెలుగులో దాదాపు అందరు సీనియర్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేసింది. తాజాగా బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ అమ్మడు నటించేందుకు కమిట్‌ అయ్యింది. బాలయ్య త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు కంప్లీట్ చేసిన గోపీచంద్ మలినేని .. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడనే టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ సినిమా కు సంబంధించిన తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక చరిత్రకారుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతూ ఉంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్న నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉంటుంది. దీంతో బాలయ్య కు లక్కి హీరోయిన్ గా మారిన నయన తార ను తీసుకుంటే ఈ సినిమాకు మంచి హిట్ తాక్ తో పాటు లక్ కూడా కలిసి వస్తుందని..డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుస్గుసలు వినిపిస్తున్నాయి. ఇక బాలయ్య నయనతార కాంబినేషన్ గురిచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జంట తెర పై కనపడితే బోమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news