ప్రభాస్.. వ్యక్తిత్వం గురించి మనందరికీ తెలిసిందే. స్టార్ హీరోగా ఎదిగిన ఇప్పటికీ సింప్లిసిటీని మెయింటెన్ చేస్తుంటాడు. అంతేకాదు సెట్‌లో నటీనటులతోపాటు టెక్నీషియన్స్‌తోనూ డార్లింగ్ సరదాగా ఉంటాడు. దీంతో అందరు ప్రభాస్ మనస్సు బంగారం అని చెబుతుంటారు. గోదావరి వంటకాలు ప్రభాస్ వారింట్లో ఫేమస్. అప్పుడప్పుడూ షూటింగ్‌లో ఉన్న వారికి తమ ఇంటి రుచులు చూపిస్తుంటారాయన. అలాగే వారికి నచ్చిన ఫుడ్ ఐటెమ్స్‌ను పార్శిల్స్ రూపంలోనూ పంపుతుంటారు.
ప్రభాస్ తో పని చేసే నటీనటులు ప్రభాస్ తిండి పెట్టి చంపేస్తాడని చెబుతుంటారు. ముఖ్య నటీనటులకు ప్రభాస్ ఇంటి నుంచి క్యారియర్లు వెళుతుంటాయని రకరకాల వంటకాలను చేయించి ప్రభాస్ సర్ ప్రైజ్ అయ్యేలా చేస్తుంటారని ప్రభాస్ సినిమాల్లో నటించే నటీనటులు అంటుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ భార్య, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కు స్వీట్ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఈ బాహుబలి. ఆ సర్ప్రైజ్ తో కరీనా కపూర్ ఆశ్చర్య పోవడమే కాదు.. ప్రభాస్ కు బిగ్ ఫ్యాన్ కూడా అయిపోయిందట. ఇంతకి ప్రభాస్ ఏం సర్ప్రైజ్ ఇచ్చాడొ తెలుసా ..??
మనకు తెలిసిన విష్యమే ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా లో నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే, సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్, హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీని కరీనా కపూర్‌కు కోసం ప్రత్యేకంగా పంపించారట. ఇక ఇదే విషయాని తన ఇన్‌స్టాలో షేర్ చేసిన కరీనా..ఇది బాహుబలి పంపిన బిర్యాని. అంటూ ఫొటోను షేర్ చేసింది. అంతేకాద్య్ ప్రభాస్‌కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మా డాల్రింగ్ మంచి మనసు అంటూ సోషల్ మీడియాలో ట్రేండింగ్ పోస్ట్లు పెడుతున్నారు.