Moviesమహేష్ బాబు కెరీర్ లోనే బెంచ్ మార్క్ బ్లాక్ బస్టర్ సినిమా...

మహేష్ బాబు కెరీర్ లోనే బెంచ్ మార్క్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!!

తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. మాస్ సినిమాలు చేసినా క్లాస్ హీరోగా మహేష్ కు తిరుగులేని ఇమేజ్ ఉంటుంది.. అందుకే ఏమో ఇతర హీరోల అభిమానులలు కూడా మహేష్ బాబు కి సపోర్ట్ చేస్తారు. తమకు నచ్చే హీరో కోసం అభిమానులు ఏమైనా చేస్తారు. తమ అభిమాని హీరోల పుట్టినరోజు అయినా..?? వాళ్ల సినిమా గురించి ఏదైనా అప్డేట్ వచ్చినా..?? అభిమానులకి అది పెద్ద పండగే. ఇక ఆ వార్త ని చెపుతూ..సంబరాలు చేసుకుంటారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు. ఇప్పుడు మహేష్ అభిమానులు కూడా అదే చేస్తున్నారు.

మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. కానీ అన్నింటీలోకి ప్రత్యేకమైన సినిమా” దూకుడు”. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్టో మళ్ళీ అలాంటి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చిన చిత్రం “దూకుడు”. ఈ న్సినిమాతో మహేష్ బాబు అభిమానులు మరోసారి ఆయనలోని మాస్ యాంగిల్ ని కూడా చూసారు. దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సమంతా హీరోయిన్ గా మొదటిసారిగా చేసింది.

ఈ చిత్రం నుంచే అప్పటికి యంగ్ హీరోయిన్ గా ఉన్న సమంతకి కూడా బ్రేక్ వచ్చింది. ఈ చిత్రం సరిగ్గా పదేళ్ల కితం రిలీజ్ అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి భారీ రికార్డునే సెట్ చేసింది. కలెక్షన్స్ పరంగా ఎవరికి అందనంత టాప్ లో రికార్డ్ సెట్ చేసింది. సెప్టెంబర్ 23తో దూకుడు సినిమా పదేళ్లు పూర్తి చేసుకోవడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూమెంట్ ని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దూకుడు సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెక్స్ట్ లెవెల్ స్దాయిలో అట్టహాసంగా సంబురాలు జరుపుకున్నారు అభిమానులు. ఇక ప్రస్తుతం మహెష్ బాబు టాలీవుడ్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి సర్క్కారు వారి పాట అనే చిత్రంతో రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news