Moviesఇదే ఫస్ట్‌ టైం అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన రెజీనా..ఫాం లోకి...

ఇదే ఫస్ట్‌ టైం అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన రెజీనా..ఫాం లోకి వచ్చిన్నట్లుందిగా..??

హీరోయిన్లు తమ పర్సనల్ విషయాలు పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలాగే.. మీడియా ముందు హాట్ కామెంట్లు చచ్చినా చేయరు. అలా మాట్లాడితే.. తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయంతో పద్ధతిగా నడుచుకుంటారు. కానీ.. రెజీనా మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ అమ్మడు సినిమాల్లో ఎంత సహజంగా నటిస్తుందో.. మీడియాముందు కూడా అంతే ఓపెన్‌గా ఉంటుంది. మొహమాటం లేకుండా ప్రతి ప్రశ్నకీ జవాబిచ్చేస్తుంది. పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడంలోనూ, హాట్ కామెంట్ చేయడంలోనూ ఈమె దిట్ట. ఇప్పుడు మరోసారి అలాంటి మాటలతోనే ఈ అమ్మడు వార్తల్లోకెక్కింది.

సుధీర్ బాబు హీరోగ నటించిన శంశ్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది చెన్నయ్ సుందరి రెజినా . తోలి చిత్రం తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది రెజీనా . ఆ తర్వాత తెలుగులో వరసగా అవకాశాలు అందుకుంది . ఇక పిల్ల నువ్వు లేని జీవితం చిత్రం లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది . ఆ తరవాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలోనూ ఈ మెగా యువ హీరోతో జతకట్టింది రెజీనా . రెజీనా కసండ్ర తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. తక్కువ టైమ్ లో మంచి పేరు తెచ్చుకున్న రెజీనా ఈ మద్య కాలంలో సినిమాలు తగ్గడం మొదలయ్యాయి. దాంతో హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు మత్తేక్కించేలా చేస్తుంది.

ఓ వైపు సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లకు గ్రీన్ సిగనలు కెరీర్‌ను గాడి లో పెట్టేందుకు అగ్ర కథానాయికలతో పోటి పడేందుకు తాపత్రయం పడుతుంది ఈ బ్యూటి. ఈ వరుసలో రెజీనా బాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నది. ప్రస్తుతం షాహిద్‌కపూర్‌, విజయ్‌సేతుపతి, రాశీఖన్నా తో ద్వయం రాజ్‌ అండ్‌ డీకే యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఓ సిరీస్‌ను తెరకెక్కిస్తున్న విష్యం తెలీసందే. ఈ సిరీస్‌లో రెజీనా కీలక పాత్రకు ఎంపికైన్నట్లు తెలిపింది ఆమె. బాలీవుడ్‌లో తన ఫస్ట్‌ వెబ్‌సిరీస్‌ మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెండేళ్ల విరామం గ్యాప్ తరువాత ఈ భామ మళ్లి బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ చేస్తుండడం విశేషం. మరి చూడాలి ఈ వెబ్ సిరీస్ తోనైనా అమ్మడు మళ్లి మంచి అవకాశాలు కొట్టేస్తుందేమో..??

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news