Moviesఈ ఇద్దరు బడా హీరోలని ముప్పుతిప్పలు పెట్టించిన ఆ స్టార్ హీరోయిన్...

ఈ ఇద్దరు బడా హీరోలని ముప్పుతిప్పలు పెట్టించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..??

నయనతార.. లేడి అమితాబ్. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా నయనతార కొనసాగుతోంది. సౌత్ క్వీన్ గా… లేడి అమితాబ్ గా నయనతార గుర్తింపు తెచ్చుకుంది. నయనతార కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనపరంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. నయనతార ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో వరుసగా సినిమాలు చేస్తున్నారు వయసు పెరిగే కొద్దీ నయనతార క్రేజ్ కూడా పెరుగుతోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా అంచెలంచలుగా ఎదుగుతూ వస్తున్న భామ నయనతార కోలీవుడ్ లో ఆమె సినిమా అంటే అక్కడ స్టర్ హీరోలు కూడా భయపడే పరిస్థితి ఉంది.

ఒకవైపు తెలుగులో మరోవైపు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది లేడీ సూపర్ స్టార్ నయనతార. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే భామ నయనతార. గ్లామర్ రోల్స్, లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో నయనతార దూసుకుపోతోంది. కథలో కొత్తదనం ఉండే సినిమాలను ఎంపిక చేసుకుంటూ.. ఆచితూచి సినిమాలను చేస్తుంది నయనతార. సౌత్ లేడి సూపర్ స్టార్ గా నిలిచిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఎన్నో పాత్రలతో మెప్పించి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించిన ఈ బ్యూటీ చేతిలో బోలెడు సినిమా అవకాశాలు ఉన్నాయి.

అయితే ఈ అమ్మడు తన దగ్గరకు వస్తున్న డైరెక్టర్స్ కి చుక్కలు చూయిస్తుందట. అసలు మ్యాటర్ ఏంటంటే..నయనతార అంతకుముందు ఏ సినిమా చేసినప్రమోషన్స్ కి హాజరయ్యేవారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి ఆమె సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన ఎటువంటి ఇంటర్వ్యూలకు కానీ, ఈవెంట్స్ కి కానీ నయనతార హాజరు అవ్వట్లేదు. సినిమా సైన్ చేసే ముందే ఈ విషయం నయనతార దర్శకనిర్మాతలకి కరాఖండీగా చెప్పేస్తున్నారట. ఈ క్రమంలోనే నయనతార వల్ల బడాతెలుగు స్టార్ హీరోలు చిరంజీవి వెంకటేష్ లు కూఅడా ఇబ్బందులు పడ్డారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేసాయి. ఇకా నయన్ వెంకటేష్ తో లక్ష్మీ, తులసి, బాబు బంగారం సినిమాల్లో నటించారు. ఇక మెగాస్టార్ తో కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news