మానవ జీవితంలో ఆకలి , దప్పిక, నీరు , నిద్ర ఎంత అవసరమో… శృంగారం కూడా అంతే అవసరం. దాంపత్య జీవితం చక్కగా ఉంది అని చెప్పాలంటే అందులో శృంగారం కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అయితే ఓ ప్రదేశంలో ప్రభుత్వ నిర్ణయంపై అసమ్మతి తెలియజేయడానికి శృంగారం వద్దంటున్నారు. టెక్సాస్ మహిళలు ఇచ్చిన ఈ సరికొత్త పిలుపు ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. దీంతొ ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల టెక్సాస్ ప్రభుత్వం.. కొత్త అబార్షన్ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ కొత్త అబార్షన్ చట్టం ప్రకారం.. ఇకపై ఆరువారాల గర్భంతో అబార్షన్ చేయించకోడానికి సిద్ధమయ్యే మహిళలకు ఇబ్బంది కానుంది. ఇదివరకు ఆరు వారాల గర్భం తర్వాత పిండాన్ని తొలగించేందుకు అనుమతి ఉండేది. అయితే.. ఈ సారి పిండాన్ని తొలగించే ముందు వైద్యులు ప్రత్యేక పరీక్షలు చేస్తారు. ఒక వేళ వారి గర్భంలోని పిండంలో హృదయ స్పందన మొదలైతే.. అబార్షన్ చేయడానికి చట్టం అంగీకరించదు.
ఈ చట్టంతో మహిళల హక్కుల్ని దారుణంగా దెబ్బ తీసే ఈ చట్టాన్ని తీసేయాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ దీని గురించి అక్కడి పాలకులు పట్టించుకోవటం లేదు. దీంతో మహిళల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో వారు పురుషులతో సంభోగం ఆపాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి మరీ నిరసన చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి, గాయని బెట్టే మిడ్లర్ మహిళాలోకానికి సెక్స్ సమ్మె ఇచ్చిన పిలుపు చర్చనీయమవుతోంది. ట్వీట్టర్ వేదికగా ఆమె తన ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు సెక్స్ సమ్మెలో పాల్గోవాలని చెప్పింది.
గర్భం దాల్చాలా? వద్దా? అనే అంశంపై సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు మహిళలకు ఉండాలన్నది ఆమె డిమాండ్. ప్రెగ్నెంట్ అయిన ఆరు వారాల వరకు మహిళలకు తాము గర్భవతులమయ్యామన్న విషయం తెలీదని.. కానీ ప్రభుత్వం ఆ గడువును కూడా కుదించటాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. దీంతో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేవరకు మహిళలు పురుషులతో సెక్స్ చేయరాదని ప్రకటించుకున్నరు. అందుకు అందరూ ఆంగీకరం తెలపడంతో ఇకపై టెక్సాస్ లో సెక్స్ కు మహిళలు దూరంగా ఉండనున్నారట.