Moviesఆ స్టార్ హీరోతో కలిసి వెండి తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న...

ఆ స్టార్ హీరోతో కలిసి వెండి తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న బడా డైరెక్టర్ డాటర్..!!

శంకర్..ఆయన సౌత్ ఇండియా లో టాప్ లేపిన డైరెక్టర్. రీజనల్ లాంగ్వేజెస్ లోనే అంతా మూవీస్ తీసుకుంటూంటే బౌండరీలు దాటేసి మరీ పాన్ ఇండియా లెవెల్ సినిమాలు తీసిన మేటి, ఘనాపాటి ఆయనే. శంకర్ అంటే నార్త్ ఇండియాలో మార్మోగిన పేరు అది. భార‌త‌దేశం గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శ‌కులలో శంక‌ర్ ఒక‌రు.ఆయ‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. ఎంతోమంది హీరోల‌కు కెరీర్ బిల్డ‌ప్ చేశారు. రోబోతో భారతీయ సినిమా రంగంలో సంచలనం క్రియేట్ చేసిన శంకర్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రస్తుతం ఈయన మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా తీస్తున్నాడు.

కాగా శంకర్‌కు ముగ్గురు పిల్లలు అన్న సంగతి తెలిసిందే. కుమారుడు అర్జిత్, కుమార్తెలు ఐశ్వర్య శంకర్, అదితి శంకర్‌. పెద్ద కుమార్తె ఐశ్యర్య వివాహం ఇటీవ‌ల‌ క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో జ‌రిగింది. అయితే ఇప్పుడు ఆయ‌న కూతురు అదితి శంకర్‌ వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తుండ‌డం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తమిళ్ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో డైరెక్టర్ ముత్తయ్య దర్శకత్వంలో విరుమన్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై హీరో సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొంబన్‌లో కార్తీతో స్క్రీన్ షేర్ చేసుకున్న‌ రాజ్ కిరణ్ “విరుమన్” లో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, సూరి కీల‌క పాత్ర‌లుపోషిస్తున్నారు. అయితే ఇందులో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్‎గా నటిస్తోంది. ఈ విషయాన్ని సూర్య అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలోని అదితీ లుక్‏ను రివీల్ చేశారు చిత్రయూనిట్. అందులో అదితి పసుపు, ఆకుపచ్చ పరికిణిలో నవ్వుతూ వస్తూ కనిపిస్తున్న లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news