మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. మరో వైపు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ అనే చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
ఇక ఈ ఈవెంట్ లో మనం ఎప్పుడు చూడని పవన్ కళ్యాణ్ ని చూడచ్చు. కోపం తో ఆవేశంతొ స్టేజ్ పై ఊగిపోయారు. మరీ ముఖ్యంగా ఏపీ అధికారిక పార్టి వైసీపీ పై చెలరేగిపోయారు. అసలు పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్స్ కి పాలిటిక్స్ కి ముడి పెట్టారు. అలాంటిది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా వాళ్ల ప్రాబ్లంస్ ని ముడి పెడుతూ నానా హంగామా చేసారు. సినీ పరిశ్రమ చాలా సెన్సిటివ్ అని .. సినీ పరిశ్రమకు ఇబ్బందులు కలిగిస్తే తాట తీస్తా అని వైసీపీ నేతలను గట్టిగా హెచ్చరించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఎలా అయింది.. హైస్పీడ్‌లో వెళ్లాడు.. నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు.. అంటూ చాలా కథనాలు వచ్చాయి. అక్కడ ఇసుక ఉంటే పడిపోయాడు.. దాని మీద కూడా అలాంటి వార్తలు రాస్తే ఎలా.. మేం కూడా మనుషులమే కదా.. కొంత కనికరించండి అంటూ చెప్పుకొచ్చారు.సినిమా ఇండస్ట్రీకి కులాలు, మతాలు ఉండవని చెప్పిన ఆయన..సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే మాడి మసై పోతారని తేల్చి చెప్పారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి హైదరాబాద్‌లోనే లక్ష మంది జీవిస్తున్నారని అన్నారు. సినిమా రంగం జోలికి వస్తే మనమంతా కలవాలని పిలుపునిచ్చారు.