మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనతోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల దృష్టిని తన వైపునకు తిప్పేసుకున్నాడు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు కొండపొలం సినిమాలో నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ చూసిన వెంటనే మాస్ ఎలిమెంట్స్ తో పాటు మనస్సును హత్తుకునేలా తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
ఓ చదువుకున్న యువకుడు, అటవీ నేపథ్యంతో పాటు తన ఫ్యామిలీ, తమ కుటుంబం ఎప్పటి నుంచో సాగు చేసే వ్యవసాయ భూములు వీటి నేపథ్యంలో ఈ సినిమా ను తెరకెక్కించినట్టు ట్రైలర్ చెపుతోంది. మొత్తం 2.45 నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుందనే చెప్పాలి. ట్రైలర్ మొత్తం మీద హీరో వైష్ణవ్ తో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్, కోట శ్రీనివాసరావు పాత్రను బాగా హైలెట్ చేశారు.
ఇక అటవీ నేపథ్యంతో పాటు పులి మీద వచ్చే సన్నివేశాలు, మేకలు కాసుకునే అమ్మాయిగా రకుల్ ఇవన్నీ బాగా ఎలివేట్ చేశారు. ఈ కొండపొలం సినిమాను ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ లో రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఏదేమైనా ట్రైలర్ చూస్తుంటే వైష్ణవ్ ఖాతాలో మరో హిట్ పడేలా ఉంది.