Gossipsఇంకా అందంగా కనిపించాలంటూ రకుల్ షాకింగ్ డెసిషన్..ఏం చేసిందో తెలిస్తే దిమ్మ...

ఇంకా అందంగా కనిపించాలంటూ రకుల్ షాకింగ్ డెసిషన్..ఏం చేసిందో తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్కువగా గ్లామర్ కు ప్రాముఖ్యత ఇచ్చే ఇండస్ట్రీ. అందంగా పుట్టడం మనిషికి దేవుడిచ్చిన వరం అన్నది ఒకప్పటి మాట! నేటి కాలంలో వైద్యులే దేవుళ్లవుతున్నారు.. అందాలను చెక్కేస్తున్నారు. అందవిహీనమైన శరీరాలను సైతం అపురూప శిల్పాలుగా మలుస్తున్నారు. అందుకే చాలా మంది సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రెటీల వరకు కత్తిగాట్లకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు.. అందంగా కనిపించకపోతే… ఇక్కడ అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు ఈ విషయం అందరికి తెలిసిందే.

అందుకే హీరోయిన్స్ అందాన్ని పెంచుకోవడానికి, మరింతగా అందంగా స్క్రీన్ పై కనిపించడానికి రకర్కాల ప్రయోగాలు చేస్తంటారు. అలాగే తమ ఇమేజ్ ను కాపాడడానికి.. కొందరు భామల సర్జరీలు కూడా చేయించుకున్నారు. ఇక తాజాగా ఆ లిస్ట్ లోకి చేరిపోయింది రకుల్ ప్రీత్ సింగ్.. రకుల్ ప్రీత్ సింగ్.. పదేళ్ల కింద కన్నడ సినిమా గిల్లితో ఇండస్ట్రీకి వచ్చింది ఈ భామ. ఆ తర్వాత హిందీలో యారియాన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ వెంటనే సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ అందుకుంది. వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్‏గా కొనసాగింది. మొదటి సినిమానే ఎంతో విజయవంతం కావడంతో దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్.

ప్రస్తుతం ఈ బ్యూటీ.. బీటౌన్‏లో ఫుల్ బిజీగా ఉంది. అటు సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లెటేస్ట్ ఫోటోలను.. తన సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సినీ ఇండ‌స్ట్రీలో పేరు తెచ్చుకున్న‌ ర‌కుల్ ప్రీత్ సింగ్‌ త‌న అందాన్ని రెట్టింపు చేసుకోవాలని.. త‌న శ‌రీరంలో ఓ భాగానికి చిన్న మార్పుతో ఆప‌రేష‌న్ చేయించుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ఆమె పెదాలు ఉన్న తీరు చూసిన వారు ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఇంకా బెట‌ర్ లుక్ కోసం ర‌కుల్ లిప్స్ ఆప‌రేష‌న్ చేయించుకుంద‌ని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news