Moviesఫ్యాన్స్ చిల్ అయ్యే వార్త చెప్పిన సమంత ..నిజంగా గ్రేట్ అంటూ...

ఫ్యాన్స్ చిల్ అయ్యే వార్త చెప్పిన సమంత ..నిజంగా గ్రేట్ అంటూ అభిమానులు సంబరాలు..!!

టాలీవుడ్‌లో గ‌త కొంత కాలంగా హాట్ డిస్క‌ర్ష‌న్ ఏదైనా ఉందా ? అంటే అది చైతు – స‌మంత విడాకుల వ్య‌వ‌హార‌మే. వార్త‌లు ఎలా ఉన్నా స‌మంత పెడుతోన్న పోస్టులు అయితే వీరి మ‌ధ్య గ్యాప్‌ను బ‌ల‌ప‌రిచేలా ఉన్నాయి. స‌మంత త‌న సోష‌ల్ మీడియాలో అక్కినేని అన్న ప‌దం తొల‌గించిన‌ప్ప‌టి నుంచి ఆమె వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు కూడా ఆమె చైతుకు దూరం అవుతోంద‌న్న ప్ర‌చారాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడాకుల‌కు అప్లై చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇద్ద‌రూ వేర్వేరుగా ఉంటున్న‌ట్టు భోగ‌ట్టా ?

టాలీవుడ్ కుందనప్పు బోమ్మ సమంత.. చూడడానికి చక్కటి రూపం..అందరిని ఆకట్టుకునే మాటలు..అద్భుతమైన నటనతో అందరి మనసులను గెలుచుకుంది. ఇక టాలీవుడ్ బడా ఫ్యామిలీ అక్కినేని ఇంటి కోడళు గా అడుగుపెట్టి .. కోడలు గాను మంచి మార్కులు వేయించుకుంది. ఇక ఖాళీ టైం దొరిక్కినప్పూడల్లా టూర్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులకు జోష్ నింపుటుంది సమంత. అయితే తాజాగా సమంత తన అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించింది.

వరుస అవార్డులు అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్న సమంతకు అరుదైన గౌరవం దక్కింది. మొన్న ఫ్యామిలీ మెన్ కి గాను ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ బెస్ట్ హీరోయిన్ అవార్డు దక్కించుకున్న సామ్ తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.ఫెమినా ఫాబ్ 40లో తాజాగా సమంతకు చోటు దక్కింది. ‘నాలుగు ఫిలిమ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు, నాలుగు సౌత్ ఇండియా ఇంటర్‌సేషనల్ మూవీ అవార్డులు, 3 సిని‘మా’ అవార్డులు గెలుచుకున్న 2021కి ఎంతో ప్రభావం చూపించే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది’ అంటూ ఫెమినా పేర్కొంది. దీనిపై సమంత కూడా స్పందించింది. ఇది తనకు ఎంతో గర్వకారణం, ధన్యవాదాలు అని శామ్ రీట్వీట్ చేసింది. అయితే టాప్ మోస్ట్ పీపుల్ కి మాత్రమే దక్కే ఈ అరుదైన గౌరవం సమంతకి దక్కటం నిజంగా గ్రేట్ అంటున్నారు నెటిజన్స్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news