Moviesచరణ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ కారు ధర...

చరణ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ కారు ధర ఎంతో తెలిస్తే..దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

రామ్ చరణ్ .. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు. మెగాఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చరణ్..మొదటి సినిమా చిరుతతో పర్లేదు అనిపించినా..ఆ తరువాత వచ్చిన మగధీర మాత్రం బాక్స్ ఆఫిస్ వద్ద భారీఇ విజయం అందుకుంది. ఇక అప్పటి నుండి ఫ్లాప్ లతో విజయాలతో తేడా లేకుండా..వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR అనే చిత్ర షూటింగ్ పూర్తి చేసి..విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమౌళితో దర్శకత్వంలో రానున్న చిత్రంలో అల్లూరి సీత రామరాజుగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ టీజర్లో రామ్ చరణ్ మరో సారి అల్లూరిని మన ముందుకు తీసుకొచ్చాడు. అన్ని కలిసివస్తే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. సినిమాల్లో హీరోగానే కాకుండా నిర్మాత గానూ తనదైన ముద్ర వేశాడు. కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి తండ్రి చిరంజీవితో ‘ఖైదీ నెం.150’, ‘సైరా’ చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నాడు

ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న చరణ్..భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ..టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. . సినిమాలే కాకుండా మన మెగాపవర్ స్టార్ కు ఖరీదైన విలాసవంతమైన కార్లంటే కూడా ఎంతో ఇష్టం. అయితే రామ్ చరణ్ కు బైక్ లు అంటే పిచ్చి. ఇప్పటికే ఆయన దగ్గర చాలా రకరకాల బైక్ లు ఉన్నాయి. కాగా రీసెంట్ గా చరణ్ ఓ కారును కొనుకున్నాడు. అయితే దాన్ని స్పెషల్‌గా దగ్గరుండి మరి తనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్లీ డిజైన్డ్ బెంజ్ కారును రామ్ చరణ్‌కు హ్యాండవర్ చేశారు. బ్లాక్ కలర్ బెంజ్ కారులో రామ్ చరణ్ రయ్‌మని వెళ్లిపోయారు. బెంజ్‌కు సంబంధించిన ఈ కారు మెర్సిడెస్ మేబచ్ జీఎల్ఎస్ 600 మోడల్ అని తెలుస్తోంది. దీని ధర దాదాపు రెండున్నర కోట్లు ఉంటుందని సమాచారం. మొత్తానికి ఈ లగ్జరీ కారును చూస్తే ఎవ్వరైనా సరే ముచ్చటపడిపోవాల్సిందే..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news