దివంగత కన్నడ కస్తూరి సౌందర్య దక్షిణ భారత దేశ సినీ చరిత్రలో తన సినిమాలతో చెరగని ముద్రవేశారు. ఆమె ఎందరో టాప్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఆమె కెరీర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ క్రింద చూద్దాం.
– సౌందర్య దక్షిణాదిలో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళంలో కలిపి మొత్తం 12 సంవత్సరాల కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించింది.
– సౌందర్య 2004లో అప్పుడు బీజేపీ ఎంపీగా కరీంనగర్ నుంచి పోటీ చేస్తోన్న కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు ఎన్నికల ప్రచారానికి వెళుతూ విమాన ప్రమాదంలో మరణించింది.
– సౌందర్య విమాన ప్రమాదంలో మరణించిన సమయంలోనే ఆమె సోదరుడు అమర్‌నాథ్ కూడా మృతి చెందారు.
– సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీరంగ ప్రవేశం కోసం ఆమె పేరును సౌందర్యగా మార్చుకుంది.
– సౌందర్య జ్ఞాపకార్థం కర్నాకట ప్రభుత్వం సౌందర్య స్మారక పురస్కారాన్ని ప్రతి యేటా ఉగాది రోజు అందచేస్తోంది.
– సౌందర్య ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగానే 1992లో గంధర్య సినిమాతో సినిమాల్లోకి వచ్చింది.
– సౌందర్య బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్‌తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ సినిమాలో నటించింది.
– ఆమె ప్రముఖ కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ సినిమా నిర్మించింది. ఈ సినిమాకు స్వర్ణకమలంతో పాటు కర్నాకట ప్రభుత్వం నుంచి ఉత్తమ సినిమా అవార్డు దక్కింది.
– ఆమె తన సొంత మేనబావనే పెళ్లాడింది. ఆమె మరణం తర్వాత ఆయన మరో వివాహం చేసుకున్నారు.
– సౌందర్య తెలుగులో స్టార్ హీరోలందరి పక్కన నటించింది. అయితే విక్టరీ వెంకటేశ్ సరసన రాజా- జయం మనదేరా- పెళ్ళి చేసుకుందాం- పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఈ జంటకు తెలుగునాట మంచి పేరు ఉంది.
– యువరత్న నందమూరి బాలకృష్ణ పక్కన ఆమె ఒక్క టాప్‌హీరో సినిమాలో మాత్రమే నటించింది. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.