Moviesరష్మిక ఓపెన్ స్టేట్మెంట్..ఏకిపారేస్తున్న నెటిజన్స్..?

రష్మిక ఓపెన్ స్టేట్మెంట్..ఏకిపారేస్తున్న నెటిజన్స్..?

రష్మిక.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీ గా గడిపేస్తున్న వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. ప్రజెంట్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్న ఈ భామా అటు బాలీవుడ్ ..ఇటు టాలీవుడ్ లోను వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ.. మధ్యలో కోలీవుడ్ సినిమాలు కూడా చేస్తుంది ఈ బ్యూటి. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో స్టార్ గా ఎదిగిన నటి రష్మిక మందన.. ఆ తరువాత తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు వస్తున్నాయి. రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని.. అభిమానులకు నేషనల్ క్రష్ గా మారింది.

ముఖ్యంగా ఆమె చేస్తున్న పుష్ప సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా ఏ మాత్రం హిట్టయినా ఆమె క్రేజ్ మరో లెవెల్ కు వెళ్లడం ఖాయం అనే చెప్పాలి. ఇదిలావుంటే, రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను సినిమాల్లోకి రాకముందు మా నాన్న, నన్ను సౌందర్యతో పోలి ఉంటానని అనేవారు. సౌందర్య నటన, సినిమాలు అంటే కూడా నాకు చాలా ఇష్టం.. అవకాశం వస్తే సౌందర్య బయోపిక్ లో నటిస్తానని.. అందుకోసం చాలానే వెయిట్ చేస్తున్నానని’ రష్మిక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇక రష్మిక మాట్Yఅలకి కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. అసలు నీకు ఆమెకు ఏం పోలిక ఉంది తల్లి అంటూ కామెంట్స్ పెడుతున్నారు

అలనాటి అందాల తార, దివంగత నటి సౌందర్య జీవితకథను సినిమాగా తెరకెక్కించనున్నారనని గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో సౌందర్య ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తెలుగుతోపాటు తమిళ్ లోనూ ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఇక టాలీవుడ్ అగ్రహీరోలందరి సరసన సౌందర్య నటించి అలరించారు. ఇప్పటికే తెలుగులో చాలా మంది రాజకీయ, క్రీడాకారుల, సినిమా తరాల జీవిత కథలు సినిమాలు గా తెరకెక్కి అలరించాయి. ఈ క్రమంలో సౌందర్య జీవిత కథకుడా సినిమా రాబోతుందని అంటున్నారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news