Moviesఆడ పిల్లలకు ఆ విషయంలో క్లారిటీ ఉండాలి ..క్యాస్టింగ్ కౌచ్ పై...

ఆడ పిల్లలకు ఆ విషయంలో క్లారిటీ ఉండాలి ..క్యాస్టింగ్ కౌచ్ పై ఇంద్రజ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. సౌత్ టు నార్త్ అన్ని సినిమా ఇండ‌స్ట్రీల్లోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఓ జాడ్యం మాదిరిగా మారిపోయింది. ఇప్ప‌టికే చాలా మంది హీరోయిన్లు ధైర్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌రీ కాస్టింగ్ కౌచ్ గురించి చెపుతున్నారు. తాము ఎవ‌రి వ‌ల్ల ఎలా ఇబ్బందులు ప‌డ్డామో చెపుతున్నారు. ఇవి పెద్ద కాంట్ర‌వ‌ర్సీలుగా మారుతున్నాయి. ఇక‌ నటి శ్రీ రెడ్డి ఈ విషయమై పెద్ద ఉద్యమమే లేవనెత్తి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ త‌ర్వాత వ‌రుస‌పెట్టి ప‌లువురు హీరోయిన్లు తాము కాస్టింగ్ కౌచ్ వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో చెప్పారు.

ఈ విషయం గురించి ఎంతోమంది సినీ తారలు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని తెలియచేసినప్పటికీ వారిని అలా ఇబ్బంది పెట్టిన దర్శక నిర్మాతల పేర్లను మాత్రం బయటకు చెప్పడానికి వెనకడుగు వేస్తారు. తాజాగా అలనాటి తార ఇంద్రజ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇక ఇదంతా కామ‌న్ అని చెప్పిన ఇంద్రజ. తాను ముక్కుసూటితనంతో వ్యవహరించడంతో పాటు ధైర్యంగా ఉండ‌డంతో క్యాస్టింగ్‌ కౌచ్‌ నుంచి త‌ప్పించుకోగ‌లిగానని ఆమె తెలిపింది.

అంతేకాదు..క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రంగంలోనూ ఉంటుంది. అయితే ఆడ పిల్లలు ఇంటి నుంచి అడుగు బయట పెడుతున్నప్పుడు.. వారు ఎక్కడికి వెళ్తున్నారు.. అక్కడ ఏదైనా సమస్యలు ఎదురైతే వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దాని పై క్లారిటీ ఉమాడాలని..అంతేకానీ అవకాశాల కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదని సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. చాలాకాలం క్రితం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ మరోసారి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news