Moviesస్టార్ హీరోయిన్ ఆత్మహత్యాయత్నం.. ఉలిక్కిపడ్డ సినీ ఇండస్ట్రీ..?

స్టార్ హీరోయిన్ ఆత్మహత్యాయత్నం.. ఉలిక్కిపడ్డ సినీ ఇండస్ట్రీ..?

దీపికా పడుకోణె .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందంతో,తన నటనతో ఎంతో మందిని ఎంటర్ టైన్ చేస్తూ..కోట్లాది మంది ప్రేక్ష్స్కులను సంపాదించుకున్న క్రేజీ బ్యూటీ. బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న ఈమె.. సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుందట. ఇంత పెద్ద హీరోయిన్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది కదా..??ఈ విషయం ఎవరో చెప్పడం కాదు..ఆమె స్వయంగా చెప్పింది. ఆమె ఎందుకు సూసైడ్ చేసుకొవాలనుకుందో గల కారణం కూడా చెప్పి అందరికి షాక్ ఇచ్చింది దీపికా.

తాజాగా ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ టీవీ షోకి గెస్ట్ గా వచ్చిన దీపికా పదుకొణె.. తన పర్సనల్ లైఫ్ గురిచి చాలా విషయాలు షేర్ చెసుకుంది. అలానే ఈమెతో పాటుగా ఫరాఖాన్‌ కూడా ఈ షో కి రావడం జరిగింది. ఈ సందర్భంగా.. దీపికా.. తను గతంలో డిప్రెషన్‌లోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. “2014లో నేను డిప్రెషన్‌లో ఉన్నాను. ఎందుకో తెలియదు లేవగానే విచిత్రంగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ని. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండేదాన్ని. చాలా సందర్భాల్లో ఎందుకు బ్రతకడం .. చనిపోదామనుకున్న.నా మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించిన మా అమ్మ.. వెంటనే సైక్రియాటిస్ట్‌ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చింది. కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్న తర్వాత డిప్రెషన్‌ నుంచి బయటపడ్డా” అంటూ చెప్పుకొచ్చారు.

తను అనుభవించిన ఈ బాధ మరెవరూ అనుభవించకూడదనే ఉద్దేశ్యంతోనే ఆమె లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌ స్థాపించానని అన్నారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా చాలా మంది డిప్రెషన్‌ నుంచి బయటపడ్డారని.. అందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాదు తన భర్త రణ్​వీర్ సింగ్ తనకు బ్రేక్​ఫాస్ట్ వండిపెట్టడం లేదని దీపికా పదుకొణె.. బిగ్​బీకి ఫిర్యాదు నవ్వుతూ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news