Moviesకృతి సనన్ కొన్న కొత్త కారు రేటు ఎంతో తెలుసా..షాక్ అవ్వడం...

కృతి సనన్ కొన్న కొత్త కారు రేటు ఎంతో తెలుసా..షాక్ అవ్వడం ఖాయం..?

జనరల్ గా మనకి ఇష్టమైన హీరో హీరోయిన్ ల గురించిన విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళ హాబీస్..డ్రెస్సింగ్ స్టైల్..ఎలాంటి ఫుడ్ తింటారు .. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఇక స్టార్ హీరో,హీరోయిన్ ల లైఫ్ స్టైల్.. తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే మన సినిమా స్టార్స్.. ఖరీదైన అద్దాల మేడల్లో ఉంటారని.. ఖరీదైన కార్లలో తిరుగుతారని అందరికి తెలిసిందే. ఇక ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు తమ అభిమానుల హీరోలు గురించి..హీరోయిన్ ల గురించి అన్ని విషయాలు నెట్టింట ప్రత్యేక్షమవుతున్నాయి.

సినిమా హీరో,హీరోయిన్స్ వాడే వస్తువులు,కట్టే బట్టలు,నడిపే బైక్స్, కార్లు ఇలా ఒకటేమిటి అన్నీ కాస్ట్లీ గానే ఉంటాయి. వాళ్ళ రేంజ్ కి తగ్గట్టు వాడతారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి విషయాలు ఇట్టే వైరల్ గా మారుతున్నాయి. ఇక ఫాన్స్ కి ఖుషీగా ఉంటోంది. తాజాగా బాలీవుడ్ బ్యూటి కృతి సనన్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. కృతిస‌న‌న్..మహేష్ బాబు వ‌న్..నేనొక్క‌డినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి దోచెయ్ సినిమాలో న‌టించింది. కానీ ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో అంతగా అవకాశాలను అందుకోలేకపోయింది కృతి. ఆ తర్వాత తెలుగు నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు.. అక్కడ మాత్రమే వరుస ఆఫర్లతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది…అక్ష‌య్ కుమార్‌, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాల‌తోపాటు ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీ అయిపోయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది. ఆదిపురుష్ తో పాటు హమ్ దే హమారే దో,గణపత్,బేధియా,బచ్చన్ పాండే వంటి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.

తాజాగా ఈమె కొన్న కారుతో నెట్టింట కృతి సనన్ పేరు మారుమ్రోగిపోతుంది. ఇక కారు అంత్యంత ఖరీదైనది కావడంతో సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ఈమె దగ్గర పలు బడాకంపెనీల కార్లు ఉండగా.. తాజాగా కృతి సనన్ మెర్సీడెస్ కంపెనీకి చెందిన ‘మే బాచ్ జి ఎల్ ఎస్ 600’ కారు కూడా కొనుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాలో ప్ఫ్స్ట్ చేసింది. అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ కారు ధర తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..ఈ కారు విలువ సుమారు 2 కోట్ల రూపాయిల పై మాటేనట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news