Gossipsఫేడ్ అవుట్ హీరోయిన్ తో కలిసి రష్మిక కొత్త పనులు..షాక్ అవుతున్న...

ఫేడ్ అవుట్ హీరోయిన్ తో కలిసి రష్మిక కొత్త పనులు..షాక్ అవుతున్న నెటిజన్స్..?

ప్రస్తుతం తెలుగులోనే కాక నేషనల్ వైడ్‌గా స్టార్ హీరోయిన్ గా తన సత్త చాటుతున్న భామ రష్మిక. టాలీవుడ్ లో ప్రస్తుతం రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో అందాల భామ రష్మిక ఒకరు. తన క్యూట్ క్యూట్ లూక్స్ తో టాలీవుడ్ లో రష్మిక ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన అందంతో, నటనతో కుర్రకారును ఫిదా చేసింది. మంచి మంచి సినిమా స్టోరీస్ సెలెక్ట్ చేసుకుని.. బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ..బంపర్ ఆఫర్స్ కొట్టేస్తుంది ఈ చిన్నది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ కన్నడ భామకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు క్యూకట్టాయి.

అటు టాలీవుడ్ లో..ఇటు బాలీవుడ్ లో వరుస్ సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీ గా ఉంది రష్మిక. ప్రస్తుతం సినిమాలు చేసే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్న రష్మిక మందన ఇక ముందు కొన్ని కొన్ని సినిమాల విషయంలో పగడ్బందీగా ముందుకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇకపోతే ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే.. ఫేడ్ అవుట్ హీరోయిన్ త్రిషతో కలిసి అమ్మడు కొత్త గా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలని చూస్తుందట. షాకింగ్ ఏమిటంటే..రష్మిక మూడూ సినిమాలను కూడా ఫైనల్ చేసిందట.

కన్నడంలో ఇప్పటికే ప్లాన్ షురూ చేసిన రష్మిక మందన .. ఈ ఐడియాని త్వరలోనే తెలుగులో కూడా మొదలు పెట్టవచ్చని టాలీవుడ్ వర్గాల భోగట్టా. త్వరలోనే దీనికి సంబంధించి రష్మిక మందన ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. త్రిషతో కలిసి ఆమె నిర్మాతగా మారారని సమాచారం. ఇక ఈ విషయమై టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆశ్చర్య పడుతున్నారట. దీపం ఉండగానే ఇళ్ళు చక్కబెట్టుకోవాలి అనే ఫారంఉలాను నిన్న కాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన రష్మిక బాగా ఫాలో అవుతుందని.. డిమాండ్ ఉన్నప్పుడే ఏదైన చేసి నాలుగు రాళ్లు వేనకేసుకుంటున్న రష్మిక డేసిషన్ కి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news