ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లెక్కల డైరెక్టర్ సుకుమార్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయో మనకు తెలిసిందే. ఇక ఆ సినిమా ల తర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ..పాన్ ఇండియా మూవీ పుష్ప తెరకెక్కుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘పుష్ప’ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది.ఇక ఈ సినిమాలో మొదటి సారి అల్లు అర్జున్ కు జంటగా..రష్మిక మందన నటిస్తుంది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..ఈ సినిమాలో ఎవ్వరూ ఊహించని విధంగా రష్మీక గిరిజన అమ్మాయిగా కనిపించబోతుంది. తాజాగా ‘పుష్ప’ మూవీ నుంచి ఓ ఆసక్తికరమై వార్త బయటకు వచ్చింది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందట. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా నటిస్తుందట. ఈమె అల్లు అర్జున్ సోదరి గా పుష్ప సినిమాలో మనకు కనిపిస్తుందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక పోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిను విలన్స్ దారుణంగా రేప్ చేసి చంపేస్తారట. ఇక ఆ తరువాత మంచిగా సైలెంట్ గా తన పని తాను చేసుకునే హీరో క్రూరంగా మారిపోయి వాళ్లపై పగ తీర్చుకుంటాడని తెలుస్తోంది. ఈ పాత్ర చనిపోయే సన్నివేశాలు ఎంతో భావోద్వేగంగా సాగుతాయని .. టోటల్ సినిమాని మలుపు తిప్పే సీన్స్ చాలా ఉన్నాయని సమాచారం. అందుకే ఈ పాత్రకు ఇనోసెంట్గా కనిపించే వర్షను ఎంపిక చేసుకున్నారని టాక్ వినిపిస్తుంది.