Moviesఆ అగ్రిమెంట్ ప్రకారం "RRR" సినిమా నాలుగు నెలల్లో రిలీజ్ చేయాలి..లేకపోతే...

ఆ అగ్రిమెంట్ ప్రకారం “RRR” సినిమా నాలుగు నెలల్లో రిలీజ్ చేయాలి..లేకపోతే జరగబోయేది ఇదే..?

‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించిన రాజమౌళి.. మళ్ళీ అదే రేంజ్‌లో RRR రూపొందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రౌద్రం, రణం, రుధిరం. ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ఇది.పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు.

చిన్నచిన్న షాట్లు మినహా ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయినట్లు ఈ మధ్యకాలంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్స్, మేకింగ్ వీడియోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ సరైన క్లారిటీ ఇవ్వడంలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ పై అభిమానుల్లో గందరగోల పరిస్దితి నెలకొంది.

అయితే తాజాగా సినీ వర్గాల పెద్దల నుండి అందుతున్న సమాచారం ప్రకార,..ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు చేయాలో అనేది పెన్ స్టూడియోస్ చేతిలో ఉందట.నిజానికి అగ్రిమెంట్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను మరో నాలుగు నెలల్లో రిలీజ్ చేయకపోతే..”ఆర్ఆర్ఆర్’ మేకర్స్.. రివర్స్ లో పెన్ స్టూడియోస్ కు పెనాల్టీ కట్టాల్సి ఉంటుందట.అంతేకాదు పెన్ స్టూడియోస్ సంస్థ కూడా.. జీగ్రూప్ కు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పెన్ స్టూడియోస్ నుంచి భారీ మొత్తంలో ‘ఆర్ఆర్ఆర్’ హక్కులను జీ గ్రూప్ దక్కించుకుంది కాబటి. సో.. మనం ఎలా చూసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రాబోయే నాలుగు నెలల్లో లోపు రిలీజ్ చేయ్యల్సిందే.. ఒక్కవేళ చేయకపోతే నిర్మాతలు భారీ నష్టం అనుభవించాల్సి ఉంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news