Gossipsక్రేజీ ఆఫర్ కొట్టేసిన రాములమ్మ..ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..?

క్రేజీ ఆఫర్ కొట్టేసిన రాములమ్మ..ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..?

ప్రస్తుతం ఉన్న యంగ్ యాంకర్ లలో ఎనర్జ్టిక్ యాంకర్ ఎవరంటే టక్కున చెప్పే సమాధానం..శ్రీముఖి. ఈ అమ్మడు తెలుగు బుల్లితెర‌పై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం బుల్లితెర స్టార్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న శ్రీ‌ముఖి హీరోయిన్ల రేంజ్ పాపులారిటీ సంపాదించుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.. వెండితెర‌పై న‌టిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీముఖి కి అద్దిరిపోయే ఆఫర్ అందింది. ప్రముఖ హీరో పక్కన లవర్ గా నటించే అవకాశం కొట్టేసింది ఈ రాములమ్మ. ఇటీవలే శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ చిత్రం విడుదల కాగా ఈ మూవీ కి మంచి స్పందన లభించింది. ఇ. స‌త్తిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రీముఖి గ్లామర్ ఓ రేంజ్ లో ఆరబోసింది. దీంతో డైరెక్టర్స్ ఆమెకు అవకాశాలు ఇస్తూన్నట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పటి వరకు హీరోలకు చెల్లెలుగా నటించిన ఈమె..ఒక్కసారిగా స్టార్ హీరో కి లవర్ పాత్రలో మెరుస్తుంది అని తెలిసింది ఆమె అభిమానులు సంబరపడుతున్నారు. ఇప్పటికే స్టార్ అల్లు అర్జున్ నటించిన జులాయి చిత్రంలో చెల్లెలిగా, యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన నేను శైలజ సినిమాలో అక్కగా నటించి అందరి దగ్గర మంచి మార్కులు వేయించుకుంది. ఇక ఈమె పటాస్ షో తో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ షో అందించిన ప్రేక్షక ఆదరణతో పెద్ద సెలబ్రిటీ గా మారిపోయింది శ్రీముఖి. ఇక బిగ్ బాస్ తర్వాత ఈమె క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. మరి కోరి వచ్చిన ఈ అవకాశాని శ్రీముఖి ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news