Moviesవామ్మో..సుహాసిని -మణిరత్నం పెళ్లి వెనుక ఇంత తంతు జరిగిందా..?

వామ్మో..సుహాసిని -మణిరత్నం పెళ్లి వెనుక ఇంత తంతు జరిగిందా..?

“సుహాసిని -మణిరత్నం”.. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి. కోలీవుడ్ లో వాళ్లది ఆఫ్ ది బెస్ట్ కపుల్స్.”మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించారు నటి సుహాసిని. మెగాస్టార్ చిరంజీవి పక్కన చేసినప్పటికీ.. తనదైన శైలీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె ప్రేక్షకుల మది దోచుకున్నారు ఆమె. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో ఆమె ప్రేక్షకులకు వినోదం పంచారు. ఇక మణిరత్నం దక్షిణాది రాష్ట్రాలలో డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి దర్శకుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు.

ఇక వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది. ఎందుకంటే మణిరత్నం ది వేరే ప్రపంచం డైరెక్టర్ గా సిలెంట్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. ఇక సుహాసిని కొంచెం అల్లరి పిల్ల ఎప్పుడు సర్దాగా..నవ్విస్తూ..నవ్వుతూ ఉంటుంది. మరి వీళ్లిద్దరికి ఎలా కుదిరింది..?? అసలు వీళ్లది లవ్ మ్యారేజ్ నా..?? లేక అరేంజ్డ్ మ్యారేజ్ నా..?? ఇలా వీళ్ల పెళ్లి గురించి చాలా మంది బోలెడు డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ..వీళ్ల పెళ్లి ఎలా జరిగిందో ? ఆ పెళ్లి వెనుక ఉన్న తతంగం ఏమిటో ? ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

అప్పట్లో సుహాసినికి-మణిరత్నం కు మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉన్నట్లో వార్తలు హల్ చల్ చేసాయి. ఈ క్రమంలోనే సుహాసిని తో ఆయన తండ్రి “నీ గురించి దర్శకుడు మణిరత్నం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఒకసారి వెళ్లి అతనిని కలువు” అంటూ సమాధానం చెప్పాడట. నిజానికి మణిరత్నం గారంటే సుహాసిని ఒక రకమైన గౌరవం ఉండేది.. కానీ అది ఇలా పెళ్లి వరకు దారితీస్తుందని అప్పుడు ఆమెకు తెలియలేదు. తండ్రి చెప్పినట్లే మణిరత్నం ను కలిసింది సుహాసిని. వీరిద్దరూ మొదటి సారి కలుసుకుని ఎంతో కూల్ గా మాట్లాడుకున్నారట. ఇక ఆ మాటలు అలా అలా కలుస్తూ.. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇక రెండు కుటుంబాల కూడా పెళ్లి కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..ఘనంగా వీళ్ల పెళ్లి జరిగింది. అలా ఏమి లేని వీళ్ల మధ్య ఏదో సంబంధం ఉందంటూ పుకార్లు పుట్టించి..ఆ పుకార్లే వీళ్లని ఒక్కటి చేసాయి. ఇప్పుడు ఈ జంట ఎంతో హ్యాపీగా ఉన్నారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news