Moviesవీళ్లందరిలో కామన్ పాయింట్ అదే..మీరు గమనించారా..??

వీళ్లందరిలో కామన్ పాయింట్ అదే..మీరు గమనించారా..??

ఏ హీరోకైనా ఓ స్టైల్ ఉంటుంది. ఒక్కొ హీరోది ఒక్కో స్టైల్. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉన్నారు. వాళ్లలో స్టార్ హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇక స్టార్ హీరోల లైఫ్ స్టైల్.. అలవాట్లు..వాళ్లు ఏం తింటారు ..ఇంట్లో ఎలా ఉంటారు..అని తెలుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు అన్ని తెలిసిపోతున్నాయి. అయితే మన సినిమా స్టార్స్.. ఖరీదైన అద్దాల మేడల్లో ఉంటారని.. ఖరీదైన కార్లలో తిరుగుతారని అందరికి తెలిసిందే. అయితే తెలుగు ఇండస్ట్రీలో లో కొంత మంది స్టార్ హీరోలకు సొంత విమానాలు కూడా ఉన్నాయట. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం…

అల్లు అర్జున్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి టూర్స్ వెళ్లడం కోసం ఓ విమానాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేశాడట. రీసెంట్ గా నాగబాబు కూతురు నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్ లోని ఉదయపూర్ కు ఈ విమానంలోనే కుటుంబంతో కలిసి వెళ్లారు బన్నీ.

నాగార్జున: టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు ఓ సొంత ఫ్లైట్ ఉందని మనకు తెలిసిందే. అయితే నాగ్ తన ఫ్యామిలీతో ఎక్కడైనా వెళ్లడానికి దీనినే వాడుతుంటారట. ప్రజెంట్ చేస్తున్న సినిమా కోసం ఇదే ఫ్లైట్‌ను వాడుతున్నారట చేస్తున్నారు.

చిరంజీవి: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఒక సొంత విమానం ఉంది. రామ్ చరణ్ ఈ విమానాన్ని సుమారు 100 కోట్లు పోసి కొనుగోలు చేశాడట. ఇక కొణిదెల నిహారిక పెళ్లి లో అతిథుల కోసం ఈ ప్రత్యేక విమానాన్ని వాడారు.

ఎన్టీఆర్: ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో మనకు తెలుసు..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇటీవల దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొంతంగా ఒక ప్రైవేటు విమానాన్ని కొనుగోలు చేశారట.. కేవ‌లం త‌న ఫ్యామిలీ ట్రిప్స్ కోస‌మే దీనిని వాడుతుంటారట.

ఇక ఈ బడా హీరోస్ వాళ్ళ విమానాలను.. తమకు దగ్గరలో గల ఎయిర్‌పోర్ట్‌లో పార్క్ చేసి ఉంచుతారు. దాని కోసం ఆయా ప్రైవేటు విమానాల యజమానాలతో ఒప్పందం కూడా చేసుకుంటారు. అంతేకాదండోయ్ వేరే వాళ్లకు ఎవరికైనా కావాల్సి వస్తే ఆ విమానాలను రెంటుకు కూడా ఇస్తూ ఉంటారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news