Moviesఆ విషయంలో మహేష్ అభిమానులకు మండిపోయింది..ఏం చేసారో తెలుసా..??

ఆ విషయంలో మహేష్ అభిమానులకు మండిపోయింది..ఏం చేసారో తెలుసా..??

తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇక ఆయన ఫ్యాన్స్ ను.. అభిమానులు అని కాదు ఏకంగా భక్తులు అంటుంటారు అందరు. మహేష్ అభిమానులు ఆయన లాగే చాలా సైలెంట్ గా ఉంటారు. మహేష్ బాబు అభిమానులు సాఫ్ట్ అనే బిరుదు లూడా ఉంది వాళ్లకు. అయితే ఆ హీరోయిన్ చేసిన పనికి ..వాళ్ళు వైల్డ్ గా మారారు. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరు..?? అసలు ఏం చేసిందో తెలుసా..??

మహేష్ బాబు అంటేనే సాఫ్ట్ మ్యాన్. ఇంకా పక్కాగా చెప్పలంటే జెంటిల్ మ్యాన్. మాస్ సినిమాలు చేసినా క్లాస్ హీరోగా మహేష్ కు తిరుగులేని ఇమేజ్ ఉంటుంది.. అందుకే ఏమో ఇతర హీరోల అభిమానులలు కూడా మహేష్ బాబు కి సపోర్ట్ చేస్తారు. తమకు నచ్చే హీరో కోసం అభిమానులు ఏమైనా చేస్తారు. వారిలాగే అందరూ చేయాలనే మొండిపట్టదలకు వెళ్లాలి అంటే ఎలా..??

అసలు విషయం ఏంటంటే.. అప్పుడెప్పుడొ గూఢచారి అనే సినిమాను మహేష్ బాబు చూసి.. సినిమా చాలా బాగా ఉందని ఓ ట్వీట్ చేశాడు. “తెలుగులో స్పై థిల్లర్ కథను ప్రయత్నించిన గూఢచారి బృందం అందరినీ మెప్పించింది. కథ, కథనం చాలా వేగంగా, ఉత్కంఠంగా సాగింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ చక్కగా నటించారు. అడవి శేషు అయితే అన్నివిధాలుగా ఆకట్టుకున్నారు.” అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. అంత వరకు బాగానే ఉంది. ఆ ట్వీట్ ను కోట్ చేస్తూ గూఢచారి హీరోయిన్ శోభిత ధూళిపాల్ల ‘‘థ్యాంక్యూ’’ అని రిప్లై ఇచ్చింది.

ఇక అక్కడే మహేష్ బాబు అభిమానులకు దొరికిపోయింది..వాళ్లకు మండిపోయింది. థ్యాంక్యూ ఒక్కటే చెప్పడం కాదు.. థ్యాంక్యూ సార్ అని అనాలట. సర్ అనలేదని ఆ హీరోయిన్ కి చుక్కలు చూయించారు. హీరోయిన్ శోభిత ధూళిపాల్ల పై ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేశారు. చివరికి ఆ బ్యూటీ తన మాటకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news