Moviesషాకింగ్: అసలు అది లవ్ నే కాదట.. ఈ బిగ్ ట్విస్ట్...

షాకింగ్: అసలు అది లవ్ నే కాదట.. ఈ బిగ్ ట్విస్ట్ ఏంటి సామీ..??

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియా లెవల్ లో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభాస్ నుండి వచ్చే ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలే. ఒకరకంగా బాలీవుడ్ హీరోలకు సమానంగా.. అంతకు మించి దక్షణాదిలో కూడా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోగా ప్రభాస్ ఇప్పుడు మంచి జోరు మీదున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా రాధే శ్యామ్‌. గోపీకృష్ణ మూవీస్‌తో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్నఈ చిత్రం తెలుగుతో పాటుగా మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానుంది. జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా యూర‌ప్ నేప‌థ్యంలో పునర్జన్మల క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోంద‌ట‌.

యూర‌ప్ నేప‌థ్యంలో కొన్ని వంద‌ల ఏళ్ల క్రితం జ‌రిగిన క‌థాంశం నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమా రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతోందని టాక్. ఈ ప్రేమ‌క‌థ‌లో పూజా ప్రేర‌ణ అనే అమ్మాయిగా క‌నిపించ‌నుంది.

నిజానికి ఈ సినిమా ఎప్పుడొ రిలీజ్ చేయాల్సింది కానీ.. రాధే శ్యామ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి..కరోనా ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు బ్రేక్ పడ్డింది. ఇక ఎలాగోలా మొత్తానికి ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.

కాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇది ఒక పీరియాడికల్ లవ్ స్టోరీ అని, యూరప్ నేపథ్యంలో తెరకెక్కుతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా అందుతున్న సమచారం ప్రకారం.. రాధే శ్యామ్ మూవీ అసలు లవ్ స్టోరీ కాదని, మిస్టరీ స్టోరీ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news