Moviesచెన్నైలో సంగీత్.. తిరుపతిలో కళ్యాణం..పక్క ప్లాన్ తో పెళ్లికి రెడి అయిన...

చెన్నైలో సంగీత్.. తిరుపతిలో కళ్యాణం..పక్క ప్లాన్ తో పెళ్లికి రెడి అయిన యంగ్ హీరోయిన్..!!

అలనాటి అందాల తార శ్రీదేవి.. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఏకైక నటి. జాన్వీ కపూర్..బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు. తల్లికి తగ్గటే అందంగా ఉంటుంది. కానీ స్కిన్ షో విషయంలో తల్లినే మించిపోయింది ఈ బ్యూటి. ఆమె బ్రతికి ఉండగానే కూతురిని పెద్ద హీరోయిన్ గా చూడాలని చాలా ఆశ పడ్డింది. కాని అది జరగలేదు. తాను ఒక్కటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లు.. తన కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. శ్రీదేవి వారసత్వాన్ని అందుకుని జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దడక్ సినిమాతో జాన్వి మెప్పించిందనే చెప్పాలి.

ఇక ఒక సినిమాతో యూత్ ను ఆకట్టుకున్న జాన్వి గ్లామర్ షోలో తల్లిని మించేలా కనిపిస్తుంది. నెలకో ఫోటో షూట్ తో జాన్వి అదరగొడుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓరేంజ్ లో దూసుకుపోతున్న ఈ గ్లామర్ బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బాగా బిజీ గా ఉంది.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో గ్లామర్ విందునే వడ్డిస్తుంది. జాన్వీ కపూర్‌ స్కిన్‌ షో విషయంలో ఏ మాత్రం తగ్గదు. గ్లామరస్‌ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటుంది.

ఓ పక్క సినిమాల్లో రెచ్చిపోతూ బీ టౌన్ ఆడియెన్స్ ను అలరిస్తున్న అమ్మడు సోషల్ మీడియాలో సెమీ న్యూడ్ పిక్స్ తో షేక్ చేస్తుంది. పొట్టి డ్రెస్సుతో పిచ్చెక్కించడం జాన్వీ స్పెషాలిటి.

తాజాగా అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ తన పెళ్లికి పెద్ద ప్లానే సెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి అన్ని ఓపెన్ గా చెప్పేసింది. తన పెళ్లి ముచ్చట్లు గురించి మాట్లాడుతూ జాన్వీ ..తాను చేసుకోబోయే వరుడు చాలా తెలివిగల వాడై ఉండాలంటోంది.

ఇంకా పెళ్లి చాలా సింపుల్‌గా రెండు రోజులు చేసుకుంటానంటోంది. ‘బ్యాచిలరేట్ పార్టీ’ గుట్టు విప్పింది. పెళ్లికి ముందు మిస్ జాను జరుపుకునే చివరి పార్టీని అందమైన దీవిలో పడవపైన ఎంజాయ్ చేస్తుందట.

ఇక పెళ్లి విషయానికి వస్తే.. పూర్తి సంప్రదాయ బద్ధంగా పూలు, మామిడి తోరణాలతో అలంకరించిన పందిరలో ఏడు అడుగులు వేస్తుందట. పెళ్లికి ముందు ఏర్పాటు చేసే సంగీత్ కార్యక్రమాన్ని అమ్మ తిరిగిన ఇల్లు చెన్నైలోని మైలాపూర్‌లో పెట్టుకుంటుందట.

వివాహం మాత్రం శ్రీవారి సన్నిధి అయిన తిరుపతిలో చేసుకుంటానని చెప్పుకొచ్చింది. జాన్వీ చెప్పిన పెళ్లి ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంత బాగానే ఉంది కానీ.. ఇంతకీ జాన్వీ మెడలో మూళ్లు వేసే ఆ అదృష్టవంతుడు ఎవరో అంటూ పెద్ద చర్చే జరుగుతుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news