Gossipsఈ కుర్ర హీరో అసలు ఆగలేడే.. అంత స్పీడా..??

ఈ కుర్ర హీరో అసలు ఆగలేడే.. అంత స్పీడా..??

తేజ సజ్జా..ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లెదౌ. టాలీవుడ్ యువ నటుడు తేజ అనేక తెలుగు సినిమాలలో బాల నటుడిగా నటించి తన నటనతో మెప్పించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. బాలనటుడిగా 50 సినిమాలకుపైగా నటించాడు.తన క్యూట్ క్యూట్ నటనతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు “రాజకుమారుడు”, “యువరాజు” సినిమాలలో తేజ యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పటికి ఆ సినిమాలలో తేజ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఇక మెగాస్టార్ “ఇంద్ర” సినిమాలో తేజ యాక్టింగ్ అయితే మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఆ తరువాత ఎన్నో సినిమాలలో బాల నటుడిగా మెప్పించిన తేజ. సమంత “ఓ బేబీ” సినిమా ద్వారా సహనటుడిగా ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత హీరోగా “జాంబీ రెడ్డి” సినిమాతో బ్లక్ బస్టర్ అందుకున్నాడు. “జాంబి రెడ్డి” తరువాత తాజాగా తేజ “ఇష్క్” అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో తేజ సరసన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయింది.

 

ప్రస్తుతం తేజ ..ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మొదటి ఇండియన్ సూపర్ మూవీలో హీరోగా తేజ సజ్జను ప్రకటిస్తూ ఇటీవలే సినిమాను ప్రారంభించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. భారీ విఎఫ్ఎక్స్ తో ఈ చిత్రం రూపొందనుంది.

ప్రస్తుతం ఈ హీరో రెమ్యూనరేషన్ విషయం చర్చనీయాంశంగా మారింది. తేజ రెమ్యునరేషన్ కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట. తేజ కి మంచి మార్క్ట్ ఉన్న మాట నిజమే.. కానీ ఒక్క సినిమా హిట్ తోనే ఒక్కసారిగా కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉమది. దీంతో ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఏదేమైనా ఒక్క హిట్ తో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అడగటంతో తేజ పేరు ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news