NewsP V Sindhu పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్.. తల్లి ఏం...

P V Sindhu పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్.. తల్లి ఏం చెప్పిందో తెలుసా..??

P V Sindhu..ఈ పేరుకి అసలు పరిచయమే అవసరం లేదు. ఈ పేరు తెలియని వారంటు ఉండరు. ప్రస్తుతం దేశం మొత్తం మోగిపోతున్న పేరు. భారత బ్యాడ్మింటన్ కెరటం.. భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింప చేసిన గొప్ప అథ్లెట్.. పీవీ సింధు. బ్యాడ్మింటన్లో భారత్ కి పథకం తీసుకు వచ్చిన ఏకైక మహిళగా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అంతే కాదు బ్యాడ్మింటన్లో ఎన్నో ఎన్నో సరికొత్త రికార్డును నెలకొల్పి.. భారత దేశం అంటే ఎంటో చూపించింది.

ఇక వరుసగా బ్యాట్మెంటన్ టైటిల్ను గెలుచుకుంటు ఎంతో విజయవంతం గా క్రీడా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. ఎంతో మంది మహిళల కు ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా తెలుగు ప్రజలకైతే P V Sindhu గర్వకారణంగా నిలిచింది అనే చెప్పాలి. ఒక తెలుగు యువతి ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్లో రాణించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం గా మారిపోయింది. ఉవ్వెత్తున ఎగసిన కెరటం లో పీవీ సింధు బ్యాట్మెంటన్ లో ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా ఆకర్షించింది. ప్రస్తుతం భారత ఆశాజ్యోతి గా పీవీ సింధు వెలుగొందుతున్న విషయం తెలిసిందే.

ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ ఆఖరి దశకు చేరుకుంటున్నాయ్. మరో నాలుగురోజుల్లో విశ్వక్రీడలకు తెరపడనుంది. ఇప్పటికే అథ్లెట్లు పతకాలతో తమ దేశాలకు పేరు తెస్తున్నాయ్. కాగా..టోక్యో ఒలింపిక్స్‌లో భారత దేశానికి రెండో పతకం సాధించిన వనితగా P V Sindhu రిక్కార్డు సృష్టించింది. అలాగే వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణి.

అంతే కాదు.. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మూడో క్రీడాకారిణిగానూ సింధు రికార్టు సాధించింది. ఇక గ‌త ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన సింధు… ఈ సారి ఖ‌చ్చితంగా స్వ‌ర్ణ ప‌త‌కం సాధిస్తుంద‌ని భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే సెమీఫైనల్లో ఆమె ఓడిపోయింది. చివ‌ర‌కు కాంస్యం కోసం సాగిన పోరులో ఆమె విజ‌యం సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించింది.

అయితే దేశం మొత్తం పి వి సింధు పేరు మారుమ్రోగిపోతున్న వేళ.. ఆమె పెళ్ళి గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సింధు పెళ్లి గురించి కూడా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సింధూ తల్లిని అడగ్గా.. ఆమె “ప్రస్తుతం సింధూ వయసు కేవలం 25 సంవత్సరాలే.. తమకు ఆమె ఎప్పుడు వివాహం చేసుకున్నా ఇబ్బంది లేదు.

మరో ఐదారేళ్లు ఆగిన తర్వాత ఆమె వివాహం చేసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇక సింధూ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివర్లో జరగనున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పింది. ఈ ఏడాది చివర్లో స్పెయిన్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధుకి పతకం వస్తే.. ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 6 పతకాలు సాధించిన ప్రపంచంలోనే తొలి మహిళా క్రీడాకారిణిగా సరికొత్త చరిత సృష్టిస్తుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news