Gossipsఆ స్టార్ హీరో వల్లే..ప్రకాష్ రాజ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందట..??

ఆ స్టార్ హీరో వల్లే..ప్రకాష్ రాజ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందట..??

ప్రకాష్ రాజ్ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారు ఉండరు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగిన నటులలో ముందు వరసలో ఉంటారు ప్రకాశ్‌రాజ్. ప్రకాష్ రాజ్ తన నటనతో, మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఇక ప్రకాశ్ రాజ్ విలన్ గా కంటే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. ఈయన కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించాడు.జాతీయ ఉత్తమ నటుడు.. విలక్షణ నటుడు.. వివాదాస్పద నటుడు ఇలా అన్ని పేర్లు ఆయనకే సొంతం.. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసుని దోచుకున్న ఆ నటుడు. తండ్రి, ప్రేమికుడు, విలన్, స్నేహితుడు, తాత ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో ఒదిగిపోతాడు.. తన నటనతో ఆ పాత్రకు జీవం పోస్తాడు. అతనే ప్రకాష్ రాజ్. విలక్షణ నటనతో సౌత్ ఇండస్ట్రీలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. సినిమాల్లో తండ్రి పాత్రేనా.,ప్రతినాయకుడి క్యారెక్టరైనా ముందుగా గుర్తొచ్చేది మాత్రం ప్రకాశ్ రాజే.

తెలుగులో యస్వీరంగారావు, సత్యనారాయణ, రావుగోపాలరావు, కోట శ్రీనివాస్ రావుల తర్వాత అంతటి క్రేజ్ సంపాదించిన వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్. సీరియల్ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచమైన ప్రకాష్ రాజ్.. చూడాలని ఉంది, సుస్వాగతం వంటి సినిమాతో టాలీవుడ్ లో ఆదరణ సొంతం చేసుకున్నాడు. వరస ఆఫర్స్ తో విభిన్న పాత్రలతో.. దక్షిణాది భాషల్లో నటిస్తూ.. ఓ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. తెలుగులో ప్రకాశ్ రాజ్ చేసిన ఒక్కడు, స్టాలిన్ వంటి విభిన్న పాత్రలను అవలిలగా పోషించాడు. ఒక్కోసారి ఈయన డిమాండ్ ఎంతలా ఉంటుంది అంటే, ఆ సినిమాలో ప్రకాశ్ రాజ్ లేకపోతే సినిమా లేదు అంతగా. ఇలా కెరీర్ పరంగా బాగా దూసుకుపోతున్న క్రమంలో..ఆయన కు ఒక్కసారిగా డిమాండ్ తగ్గింది. అందుకు కారణం.. ఓ తమిళ హీరోనట. ఆయన ఎవరో తెలుసా..??

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అది..అదే తమిళ స్టార్ అయినటువంటి విజయ్ సేతుపతి. ఇక ఈయన హీరోగా కంటే విలన్ గానే బాగా మెప్పిస్తున్నాడు అని అంటున్నారు అందరు. ఉప్పెన సినిమాతో తెలుగు హీరోలను బాగా ఆకట్టుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమా లో ఉండే విధంగా కొందరు హీరోలు, నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారట. కొన్ని సినిమాలలో ప్రకాష్ రాజ్ నుండి విజయ్ సేతుపతి దగ్గరికి రావడం వల్ల ఆయనకి డిమాండ్ తగ్గాయని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరైనా కొత్త స్టార్ వచ్చినా.. విలన్ లు వచ్చినా.. ముందు బాగా పాపులర్ అయిన వారి ఇమేజ్ కాస్త తగ్గుతుంది. ప్రస్తుతం అలాంటిదే జరిగింది ప్రకాష్ రాజ్ కు అనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news