Moviesకోహ్లీ అలా అనేసరికి ఒక్కసారిగా సీరియస్ అయిన అనుష్క..!!

కోహ్లీ అలా అనేసరికి ఒక్కసారిగా సీరియస్ అయిన అనుష్క..!!

ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ల ప్రేమ వ్యవహారం గురించి అందరికి తెలిసిన విషయమే. వీళ్ళ లవ్ మ్యాటర్ గుట్టు చప్పుడు కాకుండా మైయిన్ టైన్ చేస్తూ.. వన్ ఫైన్ డే .. మేము పెళ్లి చేసుకొబొతున్నం అంటూ మీడియా ముందు ఓపెన్ అప్ అయ్యిపోయారు. కోహ్లీ, క్రికెట్ వరల్డ్‌లో రారాజుగా ఎదిగితే, ఆయన సతీమణి అనుష్క ‘క్వీన్‌’గా గుర్తుంపు తెచ్చుకుంది. భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అత‌డి భార్య అనుష్క‌ను దేశ‌వ్యాప్తంగా ఉన్న వీరి అభిమానులు ముద్దుగా విరుష్క‌గా పిలుచుకుంటారు.

పెళ్లికి ముందు వీరు డేటింగ్లో ఉన్న‌ప్ప‌టి నుంచే వీరికి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ జంట సోష‌ల్ మీడియాలో త‌మ గురించి ఏ చిన్న పోస్ట్ పెట్టినా, ఫోటో పెట్టినా దుమ్ము రేగిపోయేలా వైర‌ల్ అవుతోంది. మొన్న ఆ మధ్య కోహ్లీ ఇన్‌స్టా గ్రామ్‌లో అనుష్క ఫొటో షేర్ చేస్తే దానికి వ‌చ్చిన లైకులు, షేర్లు ఆసియాడ్‌లోనే రికార్డు క్రియేట్ చేశాయి.

ఆసియా ఖండంలోనే ఏ వ్య‌క్తి షేర్ చేసిన ఫొటోకు రాని లైకులు, కామెంట్ల‌తో అనుష్క‌, విరాట్ కోహ్లీ ఫొటో రికార్డు క్రియేట్ చేసింది. చాలా కాలం ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. 2017 డిసెంబరులో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ జంట పండండి పాపకు జన్మనిచ్చారు. తమ కూతురికి వామిక అనే అందమైన పేరు పెట్టారు విరుష్క.

ప్రస్తుతం విరాట్ ఇంగ్లండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్ కోసం ఫ్యామిలీతో సహా వెళ్లిపోయారు క్రికెటర్స్. ఈ సిరీస్ ఆరంభానికి ముందు క్రికెటర్ దినేష్ కార్తిక్ తో మాట్లాడే క్రమంలో.. అనుష్క శర్మతో తన ఫస్ట్ మీటింగ్ గురించి చెప్పాడట. అనుష్క శర్మని మొదటిసారి చూసినప్పుడు ఆమె ధరించిన హై హీల్స్‌ని ఉద్దేశిస్తూ కోహ్లీ.. “ఏంతీ..ఇంతకంటే ఎత్తు చెప్పులు దొరకలేదా నీకూ..?” అని జోక్ చేశా.. అంతే ఆమె ఒక్కసారిగా సీరియస్ అయ్యి.. కోహ్లీ పై పంచ్ వేసిందట. “నేనేమీ అరడుగులు లేను. అందుకే హై హీల్స్‌ వేసుకున్నా” అని స్ట్రాంగ్ పంచ్ ఇచ్చిందట అనుష్క. అలా కోహ్లీ అనుష్కను మొదటిసారి కలిసినప్పుడు జరిగిన విషయాన్ని పంచుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news