Moviesఈ హీరోను ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదో తెలుసా..?

ఈ హీరోను ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదో తెలుసా..?

ఈ రంగుల ప్రపంచం సినిమా ఇండస్ట్రీ అంటేనే అంతే..క్రేజ్ ఉంటేనే కనిపిస్తాం..లేకపోతే ఇక లేనట్టే. ఓ హీరోకి వరుసగా రెండు హిట్లు పడితే.. ఇంకేముంది డైతెక్టర్లు, నిర్మాతలు ఆయన చుట్టూ తిరుగుతుంటారు. ఆ హీరోకి మంచి క్రేజ్ తో పాటూ వరుస అవకాశాలు కూడా ఇస్తుంటారు. మరి అదే హీరోకి వరుసగా ప్లాపులు వస్తే.. ఇంకెముంది ఖేల్ ఖతం దుకాణ్ బంద్.. నువ్వు ఎవరో నాకు తెలిదు అంతే.. వెంటనే ప్లేట్ మార్చేస్తారు. అందుకే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవ్వరం చెప్పలేం. హీరోకి మంచి టాలెండ్ ఉండి ప్లాపుల్లో ఉంటే వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోతాయి. ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాడు మన ర్క్100 హీరో కార్తికేయ.

యంగ్ హీరో కార్తికేయ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో కార్తికేయ కు జంటగా పాయల్ రాజ్ పుత్ నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు.. అందరిని మనసులను గెలుచుకుంది.

ఇక ఆ త్రువాత ఈ హీరో కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అందులో భాగంగా హిప్పి , గుణ 369 , 90 ఎం ఎల్ సినిమాలో నటించాడు. కానీ వీటిలో ఏ ఒక్క సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ మధ్య కార్తికేయ నుంచి చివరగా వచ్చిన సినిమా ‘చావు కబురు చల్లగా’ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ హీరోని దర్శక నిర్మాతలే కాదు.. జనాలు కూడా పట్టించుకోవడం మానేసారు.

అయితే, ప్రస్తుతం ఈ హీరో చిరంజీవి హీరోగా నటించి 1990 లో విడుదలైన ‘రాజా విక్రమార్క’ సినిమా పేరును తన సినిమా పేరు గా పెట్టుకున్నాడు. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్య విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో కన్నడలో స్టార్ హీరో అయినా రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్ర హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా అయినా కార్తికేయ కు మంచి సక్సెస్ ను తెచ్చిపెడుతుందో లేదో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news