Gossipsవామ్మో వారి నాయనో ఈ దర్శకుడు..మాములోడు కాదండోయ్..?

వామ్మో వారి నాయనో ఈ దర్శకుడు..మాములోడు కాదండోయ్..?

అదేదో సినిమలో మాహేష్ బాబు చెప్పినట్లు.. ఎప్పుడు వచ్చమా అన్నదికాదు..బుల్లెట్ దిగ్గిందా లేదా..అన్నట్లు.. సినీ ఇండస్ట్రిలో కి ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చమా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ‘జాతిరత్నాలు’ సినిమా చూస్తుంటే..అదే అనిపిస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుడి ముఖంపై చిరునవ్వుకాదు.. బాబోయ్ ఇంకొంచెం నవ్వడానికి ఓపిక ఉంటే బాగుండు అనేలా.. ఎక్కడ బోర్ కొట్టకుండా తీశాడు దర్శకుడు అనుదీప్.

నవీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం ‘జాతిరత్నాలు’ సినిమా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఏ థియేటర్ చూసుకున్నా హౌల్ ఫుల్ కలెక్షన్లతో కిక్కిరిసిపోయింది.

ఇంకా చెప్పాలంటే.. లాక్ డౌన్ తర్వాత విడుదలైన అన్ని సినిమాల కలెక్షన్స్‌ను తుడిచిపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఏ సినిమా ఇంతలా కలెక్ట్ చేయలేదు. ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉంటే అనుదీప్ తరువాతి సినిమా ఏంటనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనిపై కొందరు హీరోల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. ఫనల్ గా .. తమిళ హీరో శివ కార్తికేయన్​తో పనిచేయనున్నారని సమాచారం. ఈ కథ ఓ ద్విభాషా చిత్రంగా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా పూర్తైయాయి అని టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం అనుదీప్ ఓ బడా స్కెచ్ వేసారట.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్టు కొట్టాలని చూస్తున్న రష్మిక మందన్నను కలిసేందుకు అనుదీప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట. ఇప్పటికే రష్మిక చేతిలో పలు బడా సినిమాలే ఉన్నాయి..బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేస్తూ..క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మికాను తన నెక్స్ట్ సినిమాలో పెట్టుకుంటే పాపులారిటీ బాగా వస్తుందని.. అంతేకాకుండా ఈ కధకు ఆమైతేనే ది బెస్ట్ అని అనుకుంటున్నారట.

అయితే చేతినిండా పెద్ద సినిమాలే పెట్టుకున్న ఈ బ్యూటీ చిన్న సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోందా.. శివ కార్తికేయన్ సినిమా పక్కన నటించడాని ఓకే చెప్పుతుందా లేదా అని తెలియాల్సి ఉంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news