Moviesషాకింగ్: నందమూరి హీరో బాలకృష్ణ పై రాళ్ల దాడి..??

షాకింగ్: నందమూరి హీరో బాలకృష్ణ పై రాళ్ల దాడి..??

నందమూరి నట వారసత్వాని అందిపుచ్చుకుని..టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించారు నట సింహం బాలకృష్ణ. బాలకృష్ణ గురించి చిన్న పిల్లడిన అడిగిన టక్కున చెప్పే సమాధానం..ఆయనకు కోపం ఎక్కువ. ఆ పేరు తలుచుకోగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఆయన ముక్కుసూటి తనం. కానీ అంతకు మించిన మంచితనం కూడా ఆయనకు ఉంది.

ఆయన సినిమాల్లో సింహం లాగ ఎలా అయితే కనిపిస్తుంటారో నిజ జీవితం లో కూడా అలాగే ఉంటాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మనసులో ఒక్కటి పెట్టుకుని.. బయటకి ఒకటి చెప్పడం..చేయడం ఆయనకు చేత కాదు. ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్లు.. మొహన్నే దాచిపెట్టకుండా మాట్లాడుతాడు ఈ లెజెండ్. అది ఎవరైనా సరే ఎదురుగా ఎంత పెద్ద వ్యక్తయినా ఉండని ఆలోచిం చాడు.. తప్పు చేస్తే బాలయ్య ఎవరిని వదలడు. ఈ విషయం అందరికి తెలిసందే. ఎంతైనా పులి బిడ్డ కదా.. ఆయన పోలికలు ఎక్కడికిపోతయి.

ముక్కుసూటిగా మరియు కుండా బద్దలు కొట్టినట్లుగా మాట్లాడడం తెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య బాబు తరువాతే ఎవరైనా. ఎన్నో ఇంటర్వ్యూలలో ఎంతో మందిని ఎటువంటి సంకోచం లేకుండా మందలించడం మనం చూసాము. అలాగే కోపంతో తన అభిమానులను సైతం కొట్టిన సందర్భాలు, తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అయితే ఇటీవలే నటుడు సమీర్ బాలయ్య బాబుతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు.బాలయ్య ధైర్య సాహసాలు మరియు సమానత్వ ఆలోచనల గురించి అతను ఆ ఇంటర్వ్యూ లో వివరిస్తూ..”లెజెండ్ సినిమా సక్సెస్ మీట్ కోసం వారు ఒక బస్సులో ప్రయాణిస్తుండగా ఒక ఊరిలో జనం బస్సుకు అడ్డంగా వచ్చారట.

వారిలో ఒక తాగుబోతు ఆ బస్సుపై రాళ్లదాడి చేయడంతో డైరెక్టర్ బోయపాటి శ్రీను గాయాలయ్యాయట. ఆ సమయంలో కొందరు అభిమానులు తాగుబోతుని కొడుతుంటే బాలకృష్ణ వెళ్లి అడ్డుపడి అతడిని కొట్టకండి అంటూ ఆపి.. అతను తాగేసి ఉన్నాడు అని చెప్పి వారిని కొట్టకుండా ఆపడట. అప్పుడు అతని మంచితనం ఏంటో మరోసారి చూసే అదృష్టం దొరికింది” అంటూ సమీర్ అన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news