సిద్దార్థ్..తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్దార్థ్. 2000 సంవత్సరం మధ్యకాలంలో టాలీవుడ్ లో తన హవా కొనసాగించాడు కోలీవుడ్ హీరో సిద్దార్థ్. ఇక బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనోద్దంటానా’,’కొంచం ఇష్టం కొంచం కష్టం’ సినిమాలతో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్దార్థ్. దిల్ రాజు నిర్మించిన బొమ్మరిల్లు చిత్రం తెలుగు సినీపరిశ్రమలో రికార్డులు సృష్టించింది. అయితే ఈ మూవీ తర్వాత సిద్దార్థ్ కు సరైన బ్రేక్ రాలేదు.
ఆతర్వాత సిద్దార్థ్ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అడపా దడపా సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
ఇక సిద్దార్థ్ కెరీర్ లో ది బెస్ట్ మూవీ.. ఎవర్ గ్రీన్ మూవి ఉంది అంటే అది “బొమ్మరిల్లు” అనే చెప్పాలి. టాలీవుడ్లో బొమ్మరిల్లు సినిమాకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బొమ్మరిల్లు.. నాన్న ప్రేమ ను చక్కగా చూపించిన సినిమా ఇది. ప్రముఖ సినీ దర్శకుడు భాస్కర్ కు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా. ఎందుకంటే ఈ సినిమా తోనే మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగు పెట్టాడు బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు సినిమాలోని ప్రతీ పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంటుంది.
ఇక ఈ సినిమాలో జెనీలియా నటన హైలెట్ అని చెప్పవచ్చు. హ..హా హాసిని అంటూ చాలా క్యూట్ గా నటించింది. ఇక 2006 ఆగస్ట్ 9న విడుదలైన ఈ మూవీ టాలీవుడ్లో ఓ హిస్టరీని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో ప్రతి సీన్ హైలైట్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా క్యారంబోర్డ్ ఆడే సీన్. ఇక ఈ సీన్ ని తన జీవితంలోనిదేనని భాస్కర్ చెబుతుంటారు.
ఇక బొమ్మరిల్లు సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆ క్లైమాక్స్ సీన్ టూ గుడ్. ఇక ఆ క్లైమాక్స్ కోసం దాదాపు పదిహేను వర్షెన్లు రాశారట. వాటి మీద వచ్చే ట్రోల్స్, మీమ్స్ తాను ఎంజాయ్ చేస్తుంటానని భాస్కర్ ఇంటర్వ్యూలో చెబుతుంటారు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంతో మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.