Moviesబాహుబలి-2 రికార్డులని బ్రేక్ చేసిన ఆ అట్టర్ ఫ్లాప్ మూవీ...

బాహుబలి-2 రికార్డులని బ్రేక్ చేసిన ఆ అట్టర్ ఫ్లాప్ మూవీ ఏంటో తెలుసా..??

ఒకప్పుడు ఒక తెలుగు సినిమా 50 కోట్ల మార్క్ దాటేందుకే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. అలా కష్ట పడిన ఆ మార్క్ చేరుకోవాలంటే అది ఓ గగనం. 50 కోట్లే ఒక రికార్డ్ అన్నట్టుగా ఉండే టాలీవుడ్ ఇండస్ట్రీ 100 కోట్లు కూడా అవలీలగా దాటే రేంజ్ కు వెళ్లింది. బాహుబలి సినిమాతో కలక్షన్స్ లెక్కలన్ని మారిపోయాయి. ఇండస్ట్రీ రికార్డులే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలను తిరగరాసింది బాహుబలి.

 

మొదటి పార్ట్ తెలుగు వర్షన్ 183 కోట్లు తీసుకు రాగా.. కన్ క్లూజన్ ఏకంగా 310 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేయడం ఓ కల నే అని అప్పట్లో అనుకున్నారు అందరు. కానీ ఈ బాహుబలి-2 సినిమా రికార్డులని బ్రేక్ చేసింది ఓ సినిమా..?? అది కూడా తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా. ఆ సినిమా ఏంటో తెలుసా..?? అదే విశ్వరూపం-2 సినిమా. వినడానికే షాకింగ్ గా ఉంది కదా..

కమల్ హాసన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కే ఈ సినిమా అసలు నచ్చలేదనే టాక్ అప్పట్లో బాగా వినిపించింది. ఆయన అభిమానుల దగ్గరి నుండి సైతం ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ మూవీ ఏకంగా రాజమౌళి బాహుబలి రికార్డ్ నే బీట్ చేసి అప్పట్లో ట్రేడ్ సర్ ప్రైజ్ చేసింది. ఏంటీ ఇంకా కూడా నమ్మలేకపోతున్నారా..? అందుకే కాబోలు కొందరు అంటుంటారు కొన్ని సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా షాకులు మీద షాకులు ఇస్తాయని. ఇంతకీ ఈ విశ్వరూపం-2 సినిమా బీట్ చేసిన బాహుబలి-2 రికార్డ్ ఏంటో తెలుసా.. ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్.

 కమల్ హాసన్, పూజాకుమార్ జంటగా నటించిన విశ్వరూపం వచ్చిన ఐదేళ్లు వచ్చిన సీక్వెల్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ వాటిని అందుకోవడంలో కమల్ భారీగా లాస్ అయిపోయాడు. బాక్స్ ఆఫిస్ దగ్గర భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ షోకే ఈ మూవీ ఫ్లాప్ అనే టాక్ వచ్చింది. కానీ కమల్ హాసన్ చెన్నైలో రెచ్చిపోయాడు. అందుకే చెన్నైలో ఫస్ట్ డే రికార్డ్స్ లో విశ్వరూపం -2 బాహుబలి-2ని బీట్ చేసింది. చెన్నైలో ఫస్ట్ డే కలెక్షన్స్ లో బాహుబలి 92లక్షలు కలెక్ట్ చేసింది. అయితే విశ్వరూపం-2 93లక్షలు వసూలు చేసి బాహుబలిని దాటేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news