Newsఫస్ట్ సినిమాతోనే జాక్ పాట్ కొట్టిన ముద్దుగుమ్మలు ఎంతమంది ఉన్నారో తెలుసా..?

ఫస్ట్ సినిమాతోనే జాక్ పాట్ కొట్టిన ముద్దుగుమ్మలు ఎంతమంది ఉన్నారో తెలుసా..?

సినీ ఇండస్ట్రికి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరే ఇక్కడ నిలతోక్కుకోగలరు. ప్రతీ ఇయర్ ఎంతో మంది కొత్త హీరోయిన్ లు ఇండస్ట్రీ లలో అడుగు పెడుతూ ఉంటారు… ఏ హీరోయిన్ కెరీర్ లో అయినా ఫస్ట్ సినిమా అన్నది చాలా స్పెషల్. ఎందుకంటే.. కొత్తగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టేవాళ్ళకి ఫస్ట్ సినిమా హిట్ అయితేనే తర్వాత ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయి. అయితే ఫస్ట్ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలి అని భారీ హంగులతో సినిమాలు ప్లాన్ చేస్తూ ఉంటారు.

సినీ ఇండస్ట్రి లో హీరోయిన్ గా ఎదగాలంటే అన్నిటికన్నా ముందు సక్సెస్ ఉండాలి.. సినిమాలు సక్సెస్ అవుతుంటే ఆటోమేటిక్ పెద్ద హీరోల, దర్శకుల, నిర్మాతల కళ్ళు హీరోయిన్ మీద పడతాయి.. ఫ్లాప్ లు అయితే చిన్న హీరో సైతం పట్టించుకోని పరిస్థితి ఇప్పటి ఇండస్ట్రీ లో ఉంది.. ఇలాంటి నేపథ్యంలో హీరోయిన్ లు సక్సెస్ అయ్యే సినిమాలు చేయడం అంటే కష్టమే అయినా వారిని అదృష్టం వారించాలి.. అయితే టాలీవుడ్ లో కొందరు మొదటి తమ సినిమాతోనే అదృష్టాన్ని పరీక్షించుకుని బ్లాక్ బస్టర్,సూపర్ హిట్ అందుకుంటారు. వాళ్లలో కొంతమంది ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..

సమంత: ఏం మాయ చేసావే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత హిట్ అందుకోవడమే కాదు.. టాలీవుడ్ నెం 1 హీరోయిన్ గా మారిపోయింది. అంతేనా ఆ సినిమాలో హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి.. పెళ్లిపీటలు ఎక్కి.. అక్కినేని ఇంటి కోడలు అయింది.

హన్సిక: 2007లో దేశముదురు సినిమాతో.. టీటౌన్ లో ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటి హన్సిక. తన అందంతో యూత్ ని తెగ ఆకట్టుకున్న ఈ చార్మింగ్ బ్యూటి.. 16 ఏళ్లకు ఆన్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.

రకుల్ ప్రీత్ సింగ్: వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రకుల్.. వరుస సినిమాలతో బిజీ అయింది.


శ్వేత బసు: కొత్తబంగారు లోకం సినిమాతో.. రంగులప్రపంచంలోకి అడుగుపెట్టిన శ్వేత బసు.. 17 ఏళ్లలోనే కెమెరాకు ఫోజులిచ్చింది.


సాయిపల్లవి: ఫిదా మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళీ బ్యూటీ సాయిపల్లవి తొలిసినిమా తోనే ఫిదా చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు స్కోప్ గల సినిమాలు చేస్తూ వరుస హిట్స్ అందుకుంటోంది.


అవికా గోర్: ఉయ్యాలా జంపాలా సినిమాతో.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. చిన్నప్పటి నుంచి చిన్నారి పెళ్లికూతురు సినిమాతో.. ఆన్ స్క్రీన్ తో అనుబంధం ఉన్న ఈ బ్యూటి.. 16 ఏళ్లకే.. టీటౌన్ లో అడుగుపెట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news